Telugu Global
Telangana

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆటో డ్రైవర్లకు కేటీఆర్ కానుక

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు కేటీఆర్.. 'మై హీరో' అంటూ తండ్రిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆటో డ్రైవర్లకు కేటీఆర్ కానుక
X

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించి 70కిలోల భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలు అందించారు. వెయ్యిమంది ఆటో డ్రైవర్లకు ఒక్కొకరికి లక్ష రూపాయల చొప్పున ప్రమాద బీమా పత్రాలను బీఆర్ఎస్ తరపున సిద్ధం చేయించారు. వారికి ఆయా పత్రాలను కేటీఆర్ అందించారు. వికలాంగులకు వీల్ చైర్ లు కూడా పంపిణీ చేశారు.


మై హీరో..

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తనయుడు కేటీఆర్.. 'మై హీరో' అంటూ తండ్రిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. లెజెండ్ కేసీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. 'హ్యాపీ బర్త్ డే డాడ్' అంటూ శుభాకాంక్షలు తెలిపారు.


రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు..

అటు రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంచిపెట్టారు నేతలు. కుట్టు మిషన్ల పంపిణీ, విద్యాసామగ్రి పంపిణీ చేపట్టారు. జిల్లా పార్టీ కార్యాలయాల్లో కేక్ లు కట్ చేసి సంబరాలు నిర్వహించారు, అన్నదానం చేపట్టారు. సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.

First Published:  17 Feb 2024 9:45 AM GMT
Next Story