Telugu Global
Telangana

బీఎస్పీకి నాగర్‌కర్నూలు, హైదరాబాద్‌.. కేసీఆర్ అధికారిక ప్రకటన

నాగర్‌కర్నూలు స్థానం నుంచి బీఎస్పీ స్టేట్ చీఫ్‌ RS ప్రవీణ్‌కుమార్ పోటీ చేయనున్నారు. హైదరాబాద్‌ అభ్యర్థిపై క్లారిటీ లేదు. ఇక మిగిలిన 15 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేయనుంది.

బీఎస్పీకి నాగర్‌కర్నూలు, హైదరాబాద్‌.. కేసీఆర్ అధికారిక ప్రకటన
X

రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం బీఆర్ఎస్‌, బీఎస్పీల మధ్య పొత్తు కుదిరింది. రెండు పార్టీల నేతల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగిన అనంతరం.. బీఎస్పీకి నాగర్‌కర్నూలు, హైదరాబాద్ స్థానాలు కేటాయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.

నాగర్‌కర్నూలు స్థానం నుంచి బీఎస్పీ స్టేట్ చీఫ్‌ RS ప్రవీణ్‌కుమార్ పోటీ చేయనున్నారు. హైదరాబాద్‌ అభ్యర్థిపై క్లారిటీ లేదు. ఇక మిగిలిన 15 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేయనుంది. ఇప్పటికే 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. మెదక్‌, నల్గొండ, భువనగిరి, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.


ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో బీఆర్ఎస్ భారీగా దెబ్బతిన్నది. రాష్ట్రంలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. బీఎస్పీతో పొత్తు ఆ పార్టీకి ఏ మేరకు లాభం చేకూరుస్తుందనేది లోక్‌సభ ఎన్నికల తర్వాతే తేలనుంది. రెండు పార్టీలు అన్ని స్థానాల్లో పరస్పర సహకారంతో పని చేస్తాయన్నారు బీఎస్పీ చీఫ్ RS ప్రవీణ్‌ కుమార్. విజయదుందుభి మోగిస్తామన్నారు

First Published:  15 March 2024 7:18 AM GMT
Next Story