Telugu Global
Telangana

నేడు బీఆర్ఎస్ గూటికి కాసాని.. ఆ స్థానం నుంచే పోటీ.!

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయదని నిర్ణయించడంతో అసంతృప్తికి లోనైన కాసాని.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కోసం చేసిన కష్టమంతా వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నేడు బీఆర్ఎస్ గూటికి కాసాని.. ఆ స్థానం నుంచే పోటీ.!
X

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నేడు గులాబీ కండువా కప్పుకోనున్నారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న యాగం దగ్గరే కేసీఆర్‌ను కలవనున్నారు కాసాని. భద్రతా కారణాల దృష్ట్యా పరిమిత సంఖ్యలో అనుచరులను మాత్రమే వెంటబెట్టుకెళ్లనున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయదని నిర్ణయించడంతో అసంతృప్తికి లోనైన కాసాని.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కోసం చేసిన కష్టమంతా వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్‌లోకి వెళ్లడమే మంచిదన్న కేడర్ సలహాతో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇక కాసానిని గోషామహల్‌ బరిలో నిలిపే అవకాశాలున్నాయంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి న్యాయం చేయాలని గులాబీబాస్‌ కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.

First Published:  3 Nov 2023 2:33 AM GMT
Next Story