Telugu Global
Telangana

కర్ణాటక ప్రొడ్యూసర్.. ఢిల్లీ డైరెక్టర్.. కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వచ్చి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ల ఇజ్జత్ తీసి పోయిండు. ఒక్క కేసీఆర్‌ను కొట్టడానికి చాలా మంది వస్తున్నారని కేటీఆర్ చెప్పారు.

కర్ణాటక ప్రొడ్యూసర్.. ఢిల్లీ డైరెక్టర్.. కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు
X

తెలంగాణలో 24 గంటల కరెంట్ ఎందుకు మూడు గంటల కరెంట్ చాలు అంటూ రైతులను అవమానపర్చాడు ఇక్కడి టీపీపీసీ నాయకుడు. పక్క రాష్ట్రం నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చి.. మేము కర్ణాటకలో ఇచ్చినట్లు 5 గంటల కరెంట్ ఇస్తామని వ్యాఖ్యానించాడు. అసలు తెలంగాణలో రైతులకు ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నామో కాంగ్రెస్ నాయకులకు తెలుసా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వచ్చి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ల ఇజ్జత్ తీసి పోయిండు. ఒక్క కేసీఆర్‌ను కొట్టడానికి చాలా మంది వస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్డేడియంకు ప్రధాని మోడీ వచ్చారు. తెలంగాణకు ఎంతో మంది దిగుతున్నారు. ఒకటే చెప్తున్నా.. కాంగ్రెస్ పార్టీకి ప్రొడ్యూసర్ కర్ణాటకలో ఉంటే.. డైరెక్టర్ ఢిల్లీలో ఉన్నాడని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తది.. గుంపులు గుంపులుగా ఎవరు వస్తారో మీరే చెప్పాలని కేటీఆర్ అన్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉండగా మరొకరు అవసరం లేదు. మన కథ బ్లాక్ బస్టర్.. కానీ వాళ్ల సిన్మా డిజాస్టర్. కర్ణాటక నుంచి వచ్చినా, గుజరాత్ నుంచి వచ్చినా వాళ్లు గెలిచేది లేదని కేటీఆర్ తనదైన శైలిలో వివరించారు. మనకు ఇవ్వాళ ఎంతో మంది మద్దతు ఇస్తున్నారు. ఎంతో మంది మన పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే పార్టీలో ఉన్న వారిలో కొంత మందికి అసంతృప్తి ఉంటుంది. కొంత మంది అలుగుతరు, గుణుగుతరు. అలిగినా, గులిగినా వాళ్లందరూ మన పార్టీ కోసం పని చేయాలి. రాబోయేది మరో సారి మన బీఆర్ఎస్ ప్రభుత్వమే. అందరికీ న్యాయం చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

పైన కేసీఆర్ బాగున్నారు, కింద ప్రజలు కూడా బాగున్నారు. కానీ మధ్యలో తెల్లంగీలు వేసుకున్న వాళ్లతోనే పంచాయితీ ఉందని ఇటీవల ఒక సార్ చెప్పాడని కేటీఆర్ అన్నారు. నా ఫోన్ ఎత్తలేదు, పిలిస్తే రాలేదు అని చాలా మంది అలుగుతున్నారు. ఆడనో ఈడనో కొంత అసంతృప్తి ఉంటది. వాళ్లందరూ మనోళ్లే.. వాళ్లు అసంతృప్తితో ఉన్నారని వదిలేయొద్దు. మనోళ్లే కాబట్టి అందరినీ దగ్గరకు తీసుకోవాలని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ఒక్కరే ఇవ్వాళ మన తెలంగాణ గొంతుకగా నిలబడ్డారు. ఆయనకు ఎంతో మంది ఉస్మానియా విద్యార్థులు సపోర్ట్ చేస్తే, తెలంగాణ విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది. అందుకే ఆయనకు మనం అండగా నిలబడదామని కేటీఆర్ పిలుపునిచ్చారు.

First Published:  7 Nov 2023 3:39 PM GMT
Next Story