Telugu Global
Telangana

బీజేపీ, కాంగ్రెస్ కొట్లాడుకోవద్దు.. బీఆర్ఎస్‌ను టార్గెట్ చేద్దాం - బండి సంజయ్‌

బండి సంజయ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. బండి సంజయ్‌ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

బీజేపీ, కాంగ్రెస్ కొట్లాడుకోవద్దు.. బీఆర్ఎస్‌ను టార్గెట్ చేద్దాం - బండి సంజయ్‌
X

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్‌, బీజేపీ కొట్లాడుకోవద్దన్నారు. తెలంగాణలో అక్కడక్కడ ఇంకా కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్‌ను బొంద పెట్టాలన్నారు సంజయ్‌.

బండి సంజయ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. బండి సంజయ్‌ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని గతంలోనే చెప్పామని..బండి సంజయ్ తాజాగా వ్యాఖ్యలతో ఇది నిరూపితమైందంటున్నారు. బీఆర్ఎస్‌ లేకుండా చేసేందుకు రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయంటున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పని చేశాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ఈ సారి కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఇదే తరహా కుట్రలకు మరోసారి తెరలేపారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

First Published:  14 Jan 2024 2:15 PM GMT
Next Story