Telugu Global
Telangana

కంటివెలుగు: రెండురోజుల్లో 3,81,414 మందిని పరీక్షించిన వైద్యబృందాలు

రెండురోజుల్లో 3,81,414 మందిని పరీక్షించిన వైద్య బృందాలు 97,335 రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమైన 77,142 మంది వ్యక్తులను గుర్తించారు.

కంటివెలుగు: రెండురోజుల్లో 3,81,414 మందిని పరీక్షించిన వైద్యబృందాలు
X

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా ప్రారంభించిన కార్యక్రమం కంటివెలుగు రెండవ దశ గురువారం ప్రారంభమయ్యింది. గురు , శుక్రవారం రెండురోజుల్లో వైద్య బృందాలు 3,81,414 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

రెండురోజుల్లో 3,81,414 మందిని పరీక్షించిన వైద్య బృందాలు 97,335 రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరమైన 77,142 మంది వ్యక్తులను గుర్తించారు. పరీక్షించబడిన వారిలో, మొత్తం 2, 06, 937 మందికి కంటి సంబంధిత సమస్యలు లేవు.

ఒక్క శుక్రవారంనాడే 2,14,032 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య బృందాలు లబ్ధిదారులకు 53,719 రీడింగ్ గ్లాసులను అందజేశాయి. 38,226 మందిని ప్రిస్క్రిప్షన్ కంటి అద్దాలను గుర్తించామని, రాబోయే రోజుల్లో స్థానిక ఆశా వర్కర్లు వాటిని అందజేస్తారని అధికారులు చెప్పారు.

పరీక్షించబడిన వ్యక్తులలో, మొత్తం 1,22,087 మందికి కంటి సంబంధిత సమస్యలు లేవు.

కంటి వెలుగు కార్యక్రమం అనుకున్న దానికన్నా ప్రజల నుండి ఎక్కువగా స్పందన వస్తున్న‌దని అధికారులు చెపారు.

First Published:  21 Jan 2023 1:23 AM GMT
Next Story