Telugu Global
Telangana

'కామారెడ్డి మాస్టర్ ప్లాన్' ముసాయిదా మాత్రమే, ఎవ్వరి భూములు తీసుకోము... స్పష్టం చేసిన కలెక్టర్

ప్రతిపాదిత ఇండస్ట్రియల్ జోన్ కోసం రైతుల భూమిని సేకరించలేదని కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన పారిశ్రామిక జోన్ ముసాయిదా మాత్రమేనని తెలిపారు. "ప్రతిపాదిత ప్రణాళికపై అభ్యంతరాలు జనవరి 11 వరకు తీసుకుంటాము. ఇప్పటివరకు దాదాపు 1000 అభ్యంతరాలు స్వీకరించాము" అని కలెక్టర్ తెలిపారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమే, ఎవ్వరి భూములు తీసుకోము... స్పష్టం చేసిన కలెక్టర్
X

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో గందరగోళం నెలకొంది. మాస్టర్ ప్లాన్ లో భాగం ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ జోన్ కోసం తమ భూములు తీసుకుంటారని రైతులు ఆందోళనలు మొదలు పెట్టారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ లు కూడా రంగంలోకి దిగడంతో కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి. ఈ పరిస్థితి రావడానికి అధికారుల వైఫల్యమే కారణమంటూ మంత్రి కేటీఆర్ కూడా కామా రెడ్డి మున్సిపల్ కమీషనర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇది ముసాయిదా మాత్రమే అని రైతులకు నచ్చజెప్పడంలో అధికారులు విఫలమయ్యారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కామా రెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

ప్రతిపాదిత ఇండస్ట్రియల్ జోన్ కోసం రైతుల భూమిని సేకరించలేదని అన్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన పారిశ్రామిక జోన్ ముసాయిదా మాత్రమేనని తెలిపారు. "ప్రతిపాదిత ప్రణాళికపై అభ్యంతరాలు జనవరి 11 వరకు తీసుకుంటాము. ఇప్పటివరకు దాదాపు 1000 అభ్యంతరాలు స్వీకరించాము" అని కలెక్టర్ తెలిపారు.

భూములు పోతాయ‌ని రైతులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు కలెక్ట‌ర్. భూములు పోతాయ‌ని ఎందుకు అపోహ ప‌డుతున్నారో తెలియ‌డం లేద‌న్నారు. భూములు పోతాయ‌న్న‌ది త‌ప్పుడు ప్రచారమే అని కలెక్టర్ స్పష్టం చేశారు. ''

ప‌ట్ట‌ణం విస్త‌రిస్తున్న‌ ప్ర‌కార‌మే మాస్ట‌ర్ ప్లాన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మొదటి దశలోనే ఉన్నాము. ముసాయిదా ఫైన‌ల్ కావడానికి చాలా ద‌శ‌లు ఉన్నాయి. రైతుల భూములు ఎక్క‌డికి పోవు. మా దృష్టికి వ‌స్తున్న అభ్య‌ర్థ‌న‌ల‌ను ప‌రిశీలించి, నివృత్తి చేస్తున్నాము. ఇండ‌స్ట్రీయ‌ల్ జోన్ అంటే భూముల సేక‌ర‌ణ కాదు'' అని క‌లెక్ట‌ర్ జితేశ్ పాటిల్ స్ప‌ష్టం చేశారు.

మరో వైపు రైతులు రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక జోన్ మాస్టర్ ప్లాన్ పై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.తమను సంప్రదించకుండానే రిక్రియేషనల్‌ జోన్‌గా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ రైతులు కోర్టును ఆశ్రయించారు.

First Published:  7 Jan 2023 9:56 AM GMT
Next Story