Telugu Global
Telangana

ప్రీతి తల్లితండ్రులకు కల్వకుంట్ల కవిత లేఖ‌!

ప్రీతి మరణానికి కారణమైన దోషులను వదిలిపెట్టబోమని, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కవిత తన లేఖలో హామీ ఇచ్చారు.

ప్రీతి తల్లితండ్రులకు కల్వకుంట్ల కవిత లేఖ‌!
X

సీనియర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకుని ప్రీతి కన్నుమూసిందని తెలియగానే ఒక తల్లిగా తాను ఎంతో వేదనకు గురయ్యానని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు ఆమె ప్రీతి తల్లితండ్రులు నరేందర్ - శారదలకు లేఖ రాశారు.

ప్రీతి కోలుకోవాలని గత మూడు రోజులుగా కోరుకున్న కోట్లాది మందిలో నేనూ ఒకరినని ఆమె ఆ లేఖలో అన్నారు. ''ఎన్నో కష్టాలకోర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేక పోతున్నాను. చదువుకుని సమాజానికి సేవ చేయాలన్న తపన, పట్టుదల మెండుగా ఉన్న ప్రీతికి ఇలా జరగడం దురదృష్టకరం. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయింది. అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను.కడుపుకోత అనుభవిస్తున్న మీకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా అది చాలా తక్కువే అవుతుంది. ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని పరిస్థితి ఇది.'' అని కవిత తన లేఖలో పేర్కొన్నారు.

ప్రీతి మరణానికి కారణమైన దోషులను వదిలిపెట్టబోమని, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కవిత తన లేఖలో హామీ ఇచ్చారు.మీకు, మీ కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం, బీఆరెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కవిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ వెంటే ఉన్నారు అని ఆమె ప్రీతి తల్లితండ్రులకు ధైర్యం చెప్పారు.

First Published:  28 Feb 2023 11:08 AM GMT
Next Story