Telugu Global
Telangana

ప్రచారంలో కవితకు అస్వస్థత.. ఆ తర్వాత ఏంజరిగిందంటే..?

అస్వస్థతకు గురైన కవిత స్థానిక బీఆర్ఎస్ నేతల ఇంటిలో విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ ఓ చిన్నపాపతో కాసేపు సరదాగా గడిపారు. ఆ పాపలోని ఉత్సాహం తనకు నూతన ఉత్తేజాన్నిచ్చిందని ట్వీట్ చేశారు కవిత.

ప్రచారంలో కవితకు అస్వస్థత.. ఆ తర్వాత ఏంజరిగిందంటే..?
X

ప్రచారంలో కవితకు అస్వస్థత.. ఆ తర్వాత ఏంజరిగిందంటే..?

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ప్రచార వాహనంపై ఆమె స్పృహతప్పి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఇటిక్యాలలో ఈరోజు ఉదయం కవిత రోడ్‌ షోలో పాల్గొన్నారు. జగిత్యాల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌ కుమార్‌ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ‍ప్రచార వాహనంపై నిలబడి ఉన్న కవిత ఒక్కసారిగా కళ్లుతిరిగి పడిపోయారు. వెంటనే స్పందించిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆమెకు సపర్యలు చేశారు. అక్కడే ఉన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్.. కవితకు ప్రాథమిక చికిత్స అందించారు.

కోలుకున్న వెంటనే తిరిగి ప్రచారం..

కవిత అస్వస్థతకు గురైనా వెంటనే తిరిగి కోలుకున్నారు. విశ్రాంతి తీసుకోవాలని సహచరులు వారిస్తున్నా ఆమె మళ్లీ ప్రచారానికే మొగ్గుచూపారు. కాసేపట్లోనే కోలుకున్న ఆమె తిరిగి ప్రచారం ప్రారంభించారు. డీహైడ్రేషన్ వల్ల ఎమ్మెల్సీ కవిత స్పల్ప అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు.



అస్వస్థతకు గురైన కవిత స్థానిక బీఆర్ఎస్ నేతల ఇంటిలో విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ ఓ చిన్నపాపతో కాసేపు సరదాగా గడిపారు. ఆ పాపలోని ఉత్సాహం తనకు నూతన ఉత్తేజాన్నిచ్చిందని ట్వీట్ చేశారు కవిత. ప్రచారం తిరిగి మొదలవుతుందని చెప్పారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనలో కూడా అపశృతి చోటు చేసుకుంది. ఆయన వాహనంపైనుంచి కిందపడిపోయే పరిస్థితి. చిన్న గాయం అయింది, పెద్ద ప్రమాదం తప్పింది. ఆ ప్రమాదం తర్వాత ఆయన కూడా ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా తిరిగి తన పర్యటన కొనసాగించారు. ఇప్పుడు కవిత కూడా అస్వస్థత లెక్క చేయకుండా తిరిగి ప్రచారంలో బిజీ అయ్యారు.

First Published:  18 Nov 2023 8:10 AM GMT
Next Story