Telugu Global
Telangana

ఉంగరాల పాల్ బాబు.. పోలింగ్ రోజూ నాన్ స్టాప్ కామెడీ

కేఏ పాల్ మాత్రం తన ఉంగరం గుర్తు అందరికీ కనపడేలా చేతి వేళన్నిటికీ ఉంగరాలు ధరించి హడావిడి చేశారు. ఉంగరాలతోనే పోలింగ్ బూత్‌లోకి వెళ్లి, అందరికీ అభివాదం చేస్తూ తన గుర్తు ఇదీ అని గుర్తు చేశారు.

ఉంగరాల పాల్ బాబు.. పోలింగ్ రోజూ నాన్ స్టాప్ కామెడీ
X

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్ర వేషాలతో ఆకట్టుకున్న కేఏ పాల్.. పోలింగ్ రోజు కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా పోలింగ్‌కి వచ్చి అభివాదాలు చేస్తూ ఓటు వేసి వెళ్లిపోయారు. కానీ కేఏ పాల్ మాత్రం తన ఉంగరం గుర్తు అందరికీ కనపడేలా చేతి వేళన్నిటికీ ఉంగరాలు ధరించి హడావిడి చేశారు. ఉంగరాలతోనే పోలింగ్ బూత్‌లోకి వెళ్లి, అందరికీ అభివాదం చేస్తూ తన గుర్తు ఇదీ అని గుర్తు చేశారు.

Advertisement

అదేంటి పోలింగ్ రోజు గుర్తు చూపిస్తూ ఓటర్లను ఆకర్షించడం తప్పుకదా అని మీడియా అడిగితే దానికి పాల్ ఇచ్చిన జవాబు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల గుర్తు అయిన కారులో పోలింగ్ బూత్ వరకూ వస్తే, తన గుర్తు ఉంగరాన్ని ధరించి తానెందుకు రాకూడదని ఎదురు ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు సైకిల్‌పై వస్తున్నారా అంటూ లాజిక్ తీశారు. మరో ప్రశ్న అడిగేలోపే.. మరో బూత్‌లోకి వెళ్లాలని చెప్పి అక్కడి నుంచి హడావిడిగా వెళ్లిపోయారు పాల్.

కాబోయే ఎమ్మెల్యేని నేనే, కాబోయే సీఎంని నేనే, పీఎంని నేనేనంటూ హడావిడి చేస్తూ ఉప ఎన్నికల ప్రచారంలో కామెడీ పంచారు కేఏ పాల్. పోలింగ్ రోజు కూడా ఆయన తగ్గేది లేదన్నట్టుగా పోలింగ్ బూత్‌ల వద్ద హడావిడి చేశారు. అడిగినా అడక్కపోయినా మీడియా ప్రతినిధులందర్నీ పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సాయంత్రంలోపు పాల్ నుంచి ఇంకెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో.

Next Story