Telugu Global
Telangana

సభ లేదు, ప్రియాంక రాలేదు.. జూపల్లికి ఖర్గే కండువా

ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్జే సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. జూపల్లితోపాటు ఆయన అనుచరులు కూడా ఢిల్లీ చేరుకున్నారు.

సభ లేదు, ప్రియాంక రాలేదు.. జూపల్లికి ఖర్గే కండువా
X

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆశ నెరవేర లేదు. తన బలమేంటో చూపిస్తూ కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ లో చేరాలనుకున్న ఆయన, ప్రియాంక గాంధీతో కండువా కప్పించుకుని హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోవాలనుకున్న ఆయన.. చివరకు ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్జే సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. జూపల్లితోపాటు ఆయన అనుచరులు కూడా ఢిల్లీ చేరుకున్నారు.

ఈరోజే చేరికలు..

జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి, ఎంపీపీ మేఘా రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న వారంతా.. ఈరోజు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమవుతారు. అనంతరం పార్టీలో చేరతారు.

బీఆర్ఎస్ ను వీడిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు చాలా తర్జనభర్జనలు అనంతరం కాంగ్రెస్ వైపు చూశారు. అయితే పొంగులేటి మాత్రం ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. జనగర్జన సభలో తన బలం కూడా చూపించారు. జూపల్లికి మాత్రం ఆ ఛాన్స్ మిస్ అయింది. వాస్తవానికి ఇద్దరూ ఒకేసభలో కాంగ్రెస్ లో చేరతారు అనుకున్నా.. జూపల్లి, కొల్లాపూర్ లో తన సత్తా చూపించాలనుకున్నారు. పొంగులేటికోసం రాహుల్ వస్తే, జూపల్లి చేరికకు ప్రియాంక గాంధీ వస్తారనే ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ప్రియాంక పర్యటన రెండుసార్లు వాయిదా పడింది. దీంతో ఇక చేసేదేం లేక జూపల్లి ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది.

First Published:  2 Aug 2023 1:42 AM GMT
Next Story