Telugu Global
Telangana

ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి కుమారుడు కేసీఆర్ తో సమావేశం...బీఆరెస్ లో చేరేందుకు ఆసక్తి

జోగి భారత్ రాష్ట్ర సమితి జాతీయ ఎజెండా గురించి కేసీఆర్ ను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల ఆవశ్యకత చాలా ఉందని జోగి అన్నారు, ఆ దిశగా బీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించారు.

ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి కుమారుడు కేసీఆర్ తో సమావేశం...బీఆరెస్ లో చేరేందుకు ఆసక్తి
X

ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి కుమారుడు, జనతా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ జోగి బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిశారు. తమ పార్టీ నేతలతో కలిసి వచ్చిన జోగి తెలంగాణ అభివృద్ధి, జాతీయ రాజకీయాలు, ఛత్తీస్‌గఢ్‌కు సంబంధించిన ఇతర అంశాలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు.

చర్చ సందర్భంగా, జోగి భారత్ రాష్ట్ర సమితి జాతీయ ఎజెండా గురించి కేసీఆర్ ను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల ఆవశ్యకత చాలా ఉందని జోగి అన్నారు, ఆ దిశగా బీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించారు.

Advertisement

తక్కువ వ్యవధిలో తెలంగాణను ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా అభివృద్ధి చేయడంతోపాటు అభివృద్ధి, సంక్షేమం రెండింటిలోనూ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా జోగి తన తండ్రి, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆత్మకథను ముఖ్యమంత్రికి బహూకరించారు.

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో జనతా కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. జోగి బీఆరెస్ లో చేరేందుకు ఆసక్తి చీపుస్తున్నారని సమాచారం

Next Story