Telugu Global
Telangana

'మాస్టర్ ప్లాన్ల'ను రద్దు చేస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేసిన జగిత్యాల, కామారెడ్డి మున్సిపల్ కౌన్సిళ్ళు

కేటీఆర్ ఆదేశాలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను సవరిస్తామని ప్రకటించారు. ఈ రోజు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ కౌన్సిల్ లో మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా కౌన్సిలర్లందరూ దానిని ఏకగ్రీవంగా ఆమోదించారు.

మాస్టర్ ప్లాన్లను రద్దు చేస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేసిన జగిత్యాల, కామారెడ్డి మున్సిపల్ కౌన్సిళ్ళు
X

రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్లు ఎట్టకేలకు రద్దయ్యాయి. రెండు మున్సిపల్ కౌన్సిళ్ళు మాస్టర్ ప్లాన్లను రద్దు చేస్తూ ఈ రోజు ఏకగ్రీవంగా తీర్మానించాయి.

డిశంబర్ 15 న జగిత్యాల మాస్ట్ర ప్లాన్ ముసాయిదా విడుదలయ్యింది. అప్పటి నుంచి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్య కాలంలో నిరసనలకు కూడా దిగారు. దాంతో కేటీఆర్ ఆదేశాలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను సవరిస్తామని ప్రకటించారు. ఈ రోజు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ కౌన్సిల్ లో మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా కౌన్సిలర్లందరూ దానిని ఏకగ్రీవంగా ఆమోదించారు.

మరో వైపు ఈ రోజు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ కూడా అత్యవసరంగా సమావేశమయ్యింది. మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి అద్వర్యంలో మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానాన్ని కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది.

తాము మాస్టర్ ప్లాన్ ను ప్రజల అవసరాలకనుగుణంగా మార్చడానికి సిద్దంగా ఉన్నట్టు కేటీఆర్ ఎప్పుడో చెప్పారని, అయినప్పటికీ ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టాయని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి ఆరోపించారు. బీఆరెస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షానే ఉంటుందని, ప్రజలు ప్రతిపక్షాల కుట్రలను అర్దం చేసుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయబోమని, ఇక ఇప్పటికైనా రైతులు ఆందోళన విరమించాలని ఆమె కోరారు.

First Published:  20 Jan 2023 10:49 AM GMT
Next Story