Telugu Global
Telangana

ఆ బీర్లు దొరక్క ఎన్ని సమస్యలంటే..? నేరుగా కలెక్టర్ కి ఫిర్యాదు..

సదరు బ్రాండ్ కోసం జగిత్యాల యువకులు 20నుంచి 30 కిలోమీటర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ఈ క్రమంలో వారు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని, దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు.

ఆ బీర్లు దొరక్క ఎన్ని సమస్యలంటే..? నేరుగా కలెక్టర్ కి ఫిర్యాదు..
X

ఫలానా కంపెనీ బీర్లు దొరకడంలేదు, దయచేసి ఆ బ్రాండ్ మాకు అందుబాటులో ఉంచండి అంటూ నేరుగా జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన ఓ యువకుడు కలకలం రేపాడు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.ఎస్.లత నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ వింత ఫిర్యాదు వచ్చింది. దీంతో ఆమె షాకయ్యారు. ఆ ఫిర్యాదుని స్వీకరించి ఆ యువకుడిని పంపించి వేశారు. ఎక్సైజ్ సూరింటెండెంట్ తో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.




ఆబీర్లు లేక ఎన్ని కష్టాలంటే..?

ఫలానా కంపెనీ బీర్లు కరీంనగర్ లో దొరుకుతున్నాయి కానీ, జగిత్యాలలో మాత్రం దొరకడంలేదంటూ బీరం రాజేష్ అనే యువకుడు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. జగిత్యాలలో అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సదరు బ్రాండ్ కోసం జగిత్యాల యువకులు 20నుంచి 30 కిలోమీటర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ఈ క్రమంలో వారు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని, దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. ఆ కంపెనీ బీర్లు దొరక్క.. ఇతర బ్రాండ్లు తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోతోందన కూడా పేర్కొన్నారు.

ప్రభుత్వానికి, ప్రజలు కూడా నష్టం..

ఆ కంపెనీ బీర్లు దొరక్కపోవడంతో ప్రజలకు, ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతోందన్నారు రాజేష్. అనధికారంకంగా ఎక్కువరేటుకి ఆ బీర్లు తీసుకొచ్చి జగిత్యాలలో అమ్ముతున్నారని, దీనివల్ల ప్రజల జేబుకి చిల్లుపడటమే కాకుండా, ప్రభుత్వం కూడా ఆదాయం కోల్పోతుందని గుర్తు చేశారు. దీన్ని వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంకోసం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో ఇలాంటి ఫిర్యాదు రావడంతో అధికారులు అవాక్కయ్యారు. జగిత్యాల బీరు ప్రియులు మాత్రం రాజేష్ ని మెచ్చుకుంటున్నారు. తమకి మంచి రోజులొచ్చాయని చెబుతున్నారు.

First Published:  27 Feb 2023 9:36 AM GMT
Next Story