Telugu Global
Telangana

అదే జరిగితే విశాఖ స్టీల్ ప్లాంట్ కే కాదు, తెలంగాణకూ నష్టమే -కేటీఆర్

మోడీ, లాభాలను ఆయన దోస్తులకు, నష్టాలను జాతికి అంకితం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిలా గనులను అక్రమంగా అదానీకి అప్పజెప్పుతున్నారని, దాని వల్ల అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కే కాకుండా తెలంగాణకు కూడా తీవ్ర నష్టం కలిగుతుందని ఆయన అన్నారు.

అదే జరిగితే విశాఖ స్టీల్ ప్లాంట్ కే కాదు, తెలంగాణకూ నష్టమే -కేటీఆర్
X

తన స్నేహితుడు అదానీ కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ ను మోడీ ప్రైవేటీకరణ చేస్తున్నారని బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అదానీకి కట్టబెట్టడానికే స్టీల్ ప్లాంట్ ను నష్టాల్లోకి నెట్టారని ఆయన ఆరోపించారు.

తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోడీ, లాభాలను ఆయన దోస్తులకు, నష్టాలను జాతికి అంకితం చేస్తున్నారని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిలా గనులను అక్రమంగా అదానీకి అప్పజెప్పుతున్నారని, దాని వల్ల అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కే కాకుండా తెలంగాణకు కూడా తీవ్ర నష్టం కలిగుతుందని ఆయన తెలిపారు. బైలదిలా గనులు అదానీ చేతికి పోకుండా ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.

''బైలదిలా గనుల నుండి బయ్యారానికి ఐరన్ ఓర్ ఇవ్వాలని మేమడిగితే 160 కి.మీ దూరం చాలా ఎక్కువ కాబట్టి ఇవ్వలేమని కేంద్రం నిరాకరించింది. ఇప్పుడు అదానీ కోసం అదే బైలదిలా గనుల నుండి ఐరెన్ ఓర్ ను 1800 కిలోమీటర్ల దూరం ఉన్న గుజరాత్ లోని ముంద్రా కు తరలించేందుకు కేంద్రం సిద్దమయ్యింది.ఈ బైలదిలా గనులు అదానీ చేతుల్లోకి వెళ్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కు, తెలంగాణకు కూడా నష్టమే'' అని కేటీఆర్ అన్నారు.

బైలదిలా గనులను కాపాడుకుంటే తప్ప విశాఖ స్టీల్‌ప్లాంట్ ను కాపాడుకోలేమని కేటీఆర్ తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం బిడ్డింగ్‌లో పాల్గొంటామని, అందుకోసం ముగ్గురు అధికారులను స్టీల్ ప్లాంట్ కు పంపించామని, వారు అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు.

First Published:  11 April 2023 8:57 AM GMT
Next Story