Telugu Global
Telangana

మరో ఐదు జిల్లాల్లో ఐటీ వెలుగులు

మహబూబ్‌నగర్‌ ఐటీ హబ్‌ను వచ్చే నెలలో ప్రారంభిస్తారు. నిజామాబాద్‌ ఐటీ హబ్‌ నిర్మాణం దాదాపు పూర్తయింది. నల్లగొండ ఐటీ హబ్‌ మరో ఆరు నెలల్లో పూర్తవుతుంది.

మరో ఐదు జిల్లాల్లో ఐటీ వెలుగులు
X

ఐటీ రంగంలో దూసుకెళ్తున్న తెలంగాణ మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. హైదరాబాద్‌లోనే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీని విస్తరిస్తోంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి కేటీఆర్ విజన్‌ బాటలేస్తోంది. టైర్-2 నగరాలకూ ఐటీని విస్తరించేందుకు ఆరేళ్ల క్రితమే తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్లింది. మరికొన్ని నెలల్లో ఆ ప్రణాళిక ఫలాలను అందించబోతోంది.

త్వరలోనే తెలంగాణలోని ఐదు జిల్లాల్లో ఐటీ హబ్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. మహబూబ్‌నగర్ ఐటీ హబ్‌ వచ్చే నెలలోనే ప్రారంభం కాబోతోంది. నిజామాబాద్, సిద్దిపేట, నల్లగొండ, ఆదిలాబాద్‌ ఐటీ హబ్‌ల నిర్మాణం వేగంగా సాగుతోంది. మరికొన్ని నెలల్లోనే అక్కడా వాటిని ప్రారంభించనున్నట్టు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.


ఐటీ హబ్స్‌పై శనివారం కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఐటీ టవర్స్ నిర్మాణ వివరాలను ట్విట్టర్లో వెల్లడించారు. ఇప్పటికే ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లో ఐటీ హబ్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అక్కడ అనేక కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికి అదనంగా మరో ఐదు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్స్‌ ఏర్పాటు కాబోతున్నాయి.

ద్వితీయ శ్రేణి నగరాల్లో నిర్మిస్తున్న ఐటీ హబ్స్ దగ్గర కూడా హైదరాబాద్‌ తరహాలోనే మౌలిక వసతులను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో కంపెనీల ఏర్పాటుకు ప్రముఖ కంపెనీలతో పాటు.. భారతీయులకు చెందిన కంపెనీలు మరింత ఉత్సాహంగా ముందుకొస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో యూనిట్ల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను ఒడిసిపట్టుకునేందుకు అవకాశం ఏర్పడుతోంది.


మహబూబ్‌నగర్‌ ఐటీ హబ్‌ను వచ్చే నెలలో ప్రారంభిస్తారు. నిజామాబాద్‌ ఐటీ హబ్‌ నిర్మాణం దాదాపు పూర్తయింది. నల్లగొండ ఐటీ హబ్‌ మరో ఆరు నెలల్లో పూర్తవుతుంది. ద్వితీయ శ్రేణి ఐటీ హబ్స్‌లో గ్రామీణ యువతకు ఎక్కువగా అవకాశాలు దొరుకుతాయి. తెలంగాణలో రాజకీయంగా, పాలన పరంగా బలమైన నాయకత్వం ఉండడం, భవిష్యత్తుకు చక్కని భరోసా ఉండడం, ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ చక్కటి సామరస్యపూరిత వాతావరణం ఉండడంతో అనేక కంపెనీలు టైర్‌-2 నగరాల్లోని ఐటీ హబ్‌ల్లో యూనిట్ల ప్రారంభానికి ఉత్సాహంగా ముందుకొస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

First Published:  18 Dec 2022 3:18 AM GMT
Next Story