Telugu Global
Telangana

అర్ధరాత్రి ఐటీ సోదాలు.. అలంపూర్‌లో హైటెన్షన్

ఐటీ అధికారుల సోదాలతో అర్ధరాత్రి అలంపూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోదాలు నిర్వహించేందుకు వచ్చిన అధికారులను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

అర్ధరాత్రి ఐటీ సోదాలు.. అలంపూర్‌లో హైటెన్షన్
X

తెలంగాణలో ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారుల తనిఖీలు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌ టార్గెట్‌గా సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. అలంపూర్‌లోని ఆయన నివాసానికి అర్ధరాత్రి చేరుకున్న అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఐటీ అధికారుల సోదాలతో అర్ధరాత్రి అలంపూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోదాలు నిర్వహించేందుకు వచ్చిన అధికారులను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఆందోళనలో సంపత్‌ భార్య సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెను అంబులెన్స్‌లో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అధికార పార్టీ అండతోనే ఐటీ సోదాలని ఆరోపించారు సంపత్‌. ఇటీవల తాండూర్ కాంగ్రెస్‌ అభ్యర్థి మనోహర్ రెడ్డి, ఆయన సోదరుడి ఆఫీసు, ఫ్యాక్టరీల్లో సోదాలు నిర్వహించారు. ఇక చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.వంద కోట్ల విలువైన అక్రమాలు గుర్తించారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే ఐటీ సోదాలని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

First Published:  27 Nov 2023 3:23 AM GMT
Next Story