Telugu Global
Telangana

మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు

మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లుడు రాజశేఖర్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.

మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు
X

బీజేపీపై కేసీఆర్‌ యుద్ధం ప్రకటించిన తర్వాత ఈడీ, ఐటీ శాఖలు టీఆర్‌ఎస్‌ నేతలను వరుస పెట్టి టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డిపై ఐటీ గురిపెట్టింది. దాదాపు 30 బృందాలు హైదరాబాద్‌లో పలువురు ప్రముఖుల నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంగా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లుడు రాజశేఖర్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే సోదాలు జరుగుతున్నాయి. కొంపల్లిలోని మల్లారెడ్డి కుమారుడి నివాసంలోనూ సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడు పలు కాలేజీలు, రియల్‌ ఎస్టేట్ సంస్థలకు డైరెక్టర్లుగా ఉన్నారు.

Advertisement

రియల్ ఎస్టేట్‌ వ్యాపారంలో వీరు పెట్టిన పెట్టుబడులపై ఐటీ ఆరా తీస్తోంది. పన్నులు ఎగ్గొట్టారన్న ఆరోపణలతో సోదాలు చేస్తున్నట్టు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. మల్లారెడ్డి దగ్గరి బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డికి చెందిన యూనివర్శిటీ, మెడికల్ కాలేజీల్లోనూ ఐటీ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. టీఆర్ఎస్‌-బీజేపీ మధ్య పొలిటికల్ వార్ మొదలైన తర్వాత పలువురు టీఆర్‌ఎస్ నాయకులపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయి.

Next Story