Telugu Global
Telangana

మంత్రి సబిత బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు..

ఫార్మా కంపెనీల యజమానుల ఇళ్లలో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం ఐటీ దాడులు ఎదుర్కొంటున్నవారిలో కొందరు మంత్రి సబిత బంధువులు కావడం విశేషం.

మంత్రి సబిత బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు..
X

హైదరాబాద్ లో మళ్లీ ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈసారి బీఆర్ఎస్ నేత, మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లను అదికారులు టార్గెట్ చేశారని అంటున్నారు. ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల ఐటీ అధికారులు సోదాలు మొదలు పెట్టారు. మొత్తం 15చోట్ల దాడులు జరుగుతున్నట్టు సమాచారం.

వారం రోజుల క్రితం మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకుడు పారిజాత నరసింహారెడ్డి, ఆ పార్టీ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి నివాసాలపై ఐటీ దాడులు జరిగాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరావు ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేశారు. నాలుగు రోజుల క్రితం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలు, ఆఫీస్ లలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కి చెందిన సబితా ఇంద్రారెడ్డి బంధువుల నివాసాల్లో సోదాలు కలకలం రేపుతున్నాయి.

ఫార్మా కంపెనీల యజమానుల ఇళ్లలో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు. అయితే ప్రస్తుతం ఐటీ దాడులు ఎదుర్కొంటున్నవారిలో కొందరు మంత్రి సబిత బంధువులు కావడం విశేషం. ఎన్నికల వేళ ఇప్పటి వరకు కేవలం కాంగ్రెస్ నేతలే ఐటీకి టార్గెట్ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతల బంధువుల ఇళ్లను కూడా టార్గెట్ చేయడం విశేషం. ఈ దాడులపై ఇంకా రాజకీయ నాయకులెవరూ స్పందించలేదు.

First Published:  13 Nov 2023 3:30 AM GMT
Next Story