Telugu Global
Telangana

పొంగులేటి ఇంట్లో రెండోరోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

ఖమ్మంలో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైన తనిఖీలు రాత్రి 7 గంటలకు పూర్తయ్యాయి. ఈ రోజు ఉదయాన్నే తిరిగి అధికారులు తనిఖీలకు వచ్చారు.

పొంగులేటి ఇంట్లో రెండోరోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు
X

మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ఆయన నివాసాలతోపాటు, నందగిరి హిల్స్ లోని ఆయన బంధువు ఇంట్లో కూడా ఐటీ అధికారులు రెండో రోజు సోదాలు మొదలుపెట్టారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ లో ఉన్న ఇంట్లో అన్ని రూమ్ లు చెక్ చేసి.. పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.

ఓ వైపు తనిఖీలు జరుగుతున్నా కూడా నిన్న పొంగులేటి తన నామినేషన్ దాఖలు చేశారు. ఐటీ అధికారుల నుంచి అనుమతి తీసుకుని మరీ ఆయన పాలేరులో నామినేషన్ వేసి వచ్చారు. అటు ఖమ్మంలోని పొంగులేటి ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లపై కూడా అధికారులు ఏకకాలంలో దాడులు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారంలో మొత్తం 29 చోట్ల ఐటీ అధికారులు దాడులు చేశారు. ఖమ్మంలో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైన తనిఖీలు రాత్రి 7 గంటలకు పూర్తయ్యాయి. ఈ రోజు ఉదయాన్నే తిరిగి అధికారులు తనిఖీలకు వచ్చారు.

పొంగులేటి బ్యాంక్ అకౌంట్ల వివరాలు సేకరించిన అధికారులు, ఆఫీసుల్లోని కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు చెందిన పలు కన్ స్ట్రక్షన్, అగ్రికల్చర్ కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లు సేకరించారు. గత ఐదేళ్లుగా ఐటీ చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. గత రెండు నెలల వ్యవధిలో శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఆర్థిక లావాదేవీల వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని మరీ సోదాలు చేపట్టారు. ఈ సోదాల నేపథ్యంలో నిన్న కొమ్మూరుకు చెందిన ఉపేందర్ ​అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ ​పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పక్కనున్న కార్యకర్తలు వెంటనే అతడిని అడ్డుకుని అక్కడి నుంచి తరలించారు.


First Published:  10 Nov 2023 5:05 AM GMT
Next Story