Telugu Global
Telangana

బీఆర్ఎస్‌ను వీడాల్సింది కాదు.. ఈటల హాట్ కామెంట్స్‌

ఒక పార్టీలో ఒక స్థాయిలో ఉన్న నాయకుడు మరో పార్టీలోకి వెళ్ల‌డం సరికాదన్నారు ఈటల. ఇది తన అనుభవంతో చెప్తున్న మాట అన్నారు. బీఆర్ఎస్‌ పార్టీలో 20 ఏళ్లు ఉన్నానని.. ఆ పార్టీలో తనకు ఓ స్థాయి, స్థానం, గౌరవం ఉండేదన్నారు.

బీఆర్ఎస్‌ను వీడాల్సింది కాదు.. ఈటల హాట్ కామెంట్స్‌
X

బీజేపీలో ఈటల రాజేందర్‌ ఇమడలేకపోతున్నారా..? బీఆర్ఎస్‌ను వీడి తప్పు చేశానన్న పశ్చాత్తాపంలో ఉన్నారా..? అంటే అవును.. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అలానే ఉన్నాయి. బీఆర్ఎస్‌లో దొరికిన గౌరవం, స్థానం మరో పార్టీలో ఆశించడం సరికాదన్నారు.

ఇంతకీ ఈటల ఏమన్నారంటే.. ఒక పార్టీలో ఒక స్థాయిలో ఉన్న నాయకుడు మరో పార్టీలోకి వెళ్ల‌డం సరికాదన్నారు ఈటల. ఇది తన అనుభవంతో చెప్తున్న మాట అన్నారు. బీఆర్ఎస్‌ పార్టీలో 20 ఏళ్లు ఉన్నానని.. ఆ పార్టీలో తనకు ఓ స్థాయి, స్థానం, గౌరవం ఉండేదన్నారు. బంధం, అనుబంధం అంతా ఆ పార్టీతో ఉండేదన్నారు. ఇక మరో పార్టీలోకి వెళ్లిన తర్వాత ముందు పార్టీలో దొరికిన గౌరవం, స్థానం ఇక్కడ దొరకదన్నారు. అది సాధ్యం కూడా కాదన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈటల ఈ కామెంట్స్ చేశారు. ఇక బీజేపీలో తాను ఆ స్థాయి గౌరవాన్ని, స్థానాన్ని కోరుకోవడం లేదన్నారు. ఈ పార్టీలో ఉన్న పద్ధతులను అర్థం చేసుకుని ఉన్నంతలో సర్దుకుపోయే ప్రయత్నం చేస్తున్నానన్నారు.


2003లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాజేందర్‌.. ఆ పార్టీలో కేసీఆర్ తర్వాతి లీడర్‌గా ఎదిగారు. టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షనేతగానూ వ్యవహరించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక రెండు టర్మ్‌ల్లోనూ కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. అయితే పార్టీలో విబేధాల కారణంగా 2021లో బీఆర్ఎస్‌ను వీడిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు.

First Published:  2 Feb 2024 5:32 AM GMT
Next Story