Telugu Global
Telangana

పటేల్‌ రమేష్‌ రెడ్డికి మళ్లీ హ్యాండిస్తారా..?

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడిన ఆయన.. తను, అద్దంకి దయాకర్‌ రేవంత్ అనుచరుల కావడం వల్లే తమకు పదవులు దక్కకుండా కుట్రలు జరుగుతున్నాయన్నారు.

పటేల్‌ రమేష్‌ రెడ్డికి మళ్లీ హ్యాండిస్తారా..?
X

పటేల్ రమేష్‌ రెడ్డి.. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పరిశీలించిన వారికి ఈ పేరు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. సూర్యాపేట నుంచి కాంగ్రెస్‌ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఓ దశలో స్వతంత్రంగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే నల్లగొండ ఎంపీ సీటు హామీ ఇచ్చి పటేల్‌ రమేష్‌ రెడ్డిని బుజ్జగించారు కాంగ్రెస్ పెద్దలు. ఎంపీ సీటుపై రమేష్‌ రెడ్డికి రాతపూర్వకంగా కూడా హామీ ఇచ్చారు.

అయితే నల్లగొండ ఎంపీ టికెట్ విషయంలో హామీ ఇచ్చినప్పటికీ.. పటేల్‌ రమేష్‌ రెడ్డికి అంత ఈజీగా సీటు దక్కే అవకాశాలు లేవంటున్నాయి పార్టీ వర్గాలు. ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మరో తనయుడు రఘువీర్ రెడ్డి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొడుకు కోసం జానారెడ్డి సైతం పావులు కదుపుతున్నారు.

పటేల్ రమేష్ రెడ్డి సైతం పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడిన ఆయన.. తను, అద్దంకి దయాకర్‌ రేవంత్ అనుచరుల కావడం వల్లే తమకు పదవులు దక్కకుండా కుట్రలు జరుగుతున్నాయన్నారు. నల్లగొండ జిల్లాపై రేవంత్ ముద్ర లేకుండా ఉండేందుకు కొంతమంది సీనియర్లు తమకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.

First Published:  22 Jan 2024 6:09 AM GMT
Next Story