Telugu Global
Telangana

మాకు కొత్త కాదు కొట్లాట.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

గతంలో ఇదే రోడ్లపై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమం చేసి.. రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు కేటీఆర్.

మాకు కొత్త కాదు కొట్లాట.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

బీఆర్ఎస్‌కు కొట్లాట కొత్త కాదంటూ ట్వీట్ చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నందుకు నిరసన తెలిపిన ఫొటోలతో పాటు ఉద్యమం నాటి ఫొటోలను తన ట్విట్టర్‌లో పంచుకున్నారు కేటీఆర్.

గతంలో ఇదే రోడ్లపై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమం చేసి.. రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు కేటీఆర్. మళ్లీ ఉద్యమం నాటి రోజులు గుర్తొచ్చాయన్నారు కేటీఆర్.


బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఉద్దేశించి సీఎం రేవంత్ చేసిన మాటలను నిరసిస్తూ అసెంబ్లీని బహిష్కరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ నేపథ్యంలో మీడియా పాయింట్ వద్దకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంతో నిరసన తెలిపారు.

First Published:  15 Feb 2024 6:50 AM GMT
Next Story