Telugu Global
Telangana

రాహుల్‌.. మా వాళ్లకు ఏ రేటు ఫిక్స్‌ చేశారు?

తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఏం ఆఫర్ చేస్తోందంటూ ప్రశ్నించారు. ఏం రేట్ డిసైడ్ చేశారంటూ రాహుల్‌ గాంధీని ట్యాగ్ చేశారు కేటీఆర్.

రాహుల్‌.. మా వాళ్లకు ఏ రేటు ఫిక్స్‌ చేశారు?
X

పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ చెప్పేదొకటి.. చేసేది మరొకటి. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే.. వేటు పడేలా కఠిన చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన విషయం తెలిసిందే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్‌. తెలంగాణలో బీఆర్ఎస్‌ నుంచి భారీగా వలసలను ప్రోత్సహిస్తున్న హస్తం పార్టీ.. గతంలో BRS చేసింది కాబట్టి ఇప్పుడు మేము చేస్తున్నామంటూ ఫిరాయింపులను సమర్థించుకుంటోంది. అయితే ఇతర రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కాంగ్రెస్‌కు ఎదురైతే.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంటూ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తోంది.


తాజాగా ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేస్తోందంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మార్చిలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ పేపర్ క్లిప్‌ను ట్వీట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కేటీఆర్‌. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఏం ఆఫర్ చేస్తోందంటూ ప్రశ్నించారు. ఏం రేట్ డిసైడ్ చేశారంటూ రాహుల్‌ గాంధీని ట్యాగ్ చేశారు కేటీఆర్. ఇక తెలంగాణలో RR ట్యాక్స్‌ ( రేవంత్ రెడ్డి ట్యాక్స్) కలెక్షన్స్‌ RRR, కల్కి కంటే ఎక్కువగా ఉన్నాయా అంటూ సెటైర్ వేశారు కేటీఆర్.

పార్టీ ఫిరాయింపుల అంశంపై వీలు చిక్కినప్పుడల్లా కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నారు కేటీఆర్. ఇటీవల ఢిల్లీ పర్యటనలోనూ కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరిని జాతీయ మీడియా వేదికగా ఎండగట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ అంశంపై ఇప్పటికే కోర్టు తలుపు తట్టింది బీఆర్ఎస్. రాష్ట్రపతికి సైతం ఫిర్యాదు చేస్తామన్నారు కేటీఆర్. ఇప్పటివరకూ 9 మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

First Published:  13 July 2024 6:41 PM GMT
Next Story