Telugu Global
Telangana

స్వాతంత్ర దినోత్సవ కానుక.. పంచాయతీ కార్మికులకు రూ.5 లక్ష బీమా

ఎవరైనా పంచాయతీ కార్మికులు మరణిస్తే తక్షణ సాయం కింద గతంలో ఇచ్చిన రూ.5 వేలను రూ.10వేలకు పెంచుతున్నట్లు కూడా చెప్పింది.

స్వాతంత్ర దినోత్సవ కానుక.. పంచాయతీ కార్మికులకు రూ.5 లక్ష బీమా
X

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. పంచాయతీ పారిశుథ్య కార్మికులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అవసరమైన ఎల్ఐసీ ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ నిర్ణయం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 51 వేల మంది పంచాయతీ కార్మికులకు లబ్ధి చేకూరనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింి.

ఇదే కాకుండా.. ఎవరైనా పంచాయతీ కార్మికులు మరణిస్తే తక్షణ సాయం కింద గతంలో ఇచ్చిన రూ.5 వేలను రూ.10వేలకు పెంచుతున్నట్లు కూడా చెప్పింది. తాజాగా ఇస్తున్న జీవో ప్రకారం కార్మికుడి జీవిత బీమా రూ.5 లక్షలకు పెరిగింది. ప్రతీ ఇన్సురెన్స్ పాలసీని సంబంధిత గ్రామ పంచాయతీనే చెల్లిస్తుంది. అయితే అందుకు అవసరమైన మొత్తాన్ని పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నది.

బీమాతోపాటు సర్వీసులో ఉండగా మరణించిన కార్మికుల అంతిమ సంస్కారాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5 వేల మొత్తాన్ని రెట్టింపు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై రెట్టింపు మొత్తం అయిన రూ. 10 వేలు సంబంధిత గ్రామ పంచాయతీ చెల్లించాలని పంచాయతీ రాజ్ శాఖ ఆదేశించింది. ఈ రెండు పథకాలు సక్రమంగా అమలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారులకు సూచించారు.

First Published:  14 Aug 2023 11:15 PM GMT
Next Story