Telugu Global
Telangana

ఐటి రైడ్స్ పేరిట మోడీ సర్కార్ దాష్టీకం...అర్దరాత్రి ఆడబిడ్డకు అవమానం !

మల్లారెడ్డి, అతని బంధువుల ఇళ్ళపై దాడులు చేస్తున్న ఐటీ అధికారులు అతిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మల్లా రెడ్డి మనవరాలు శ్రేయారెడ్డిని నిన్న రాత్రి పూట మహిళా అధికారులు లేకుండా సీఆర్పీఎఫ్ పోలీసులు తీసుకెళ్ళారు.

ఐటి రైడ్స్ పేరిట మోడీ సర్కార్ దాష్టీకం...అర్దరాత్రి ఆడబిడ్డకు అవమానం !
X

టీఆరెస్ ఎమ్మెల్యేల కేసులో అడ్డంగా బుక్కైన తర్వాత టీఆరెస్ పై ప్రతీకారానికి సిద్దమైంది బీజేపీ. టీఆరెస్ నాయకుల ఇళ్ళపై, ఈడీ, ఐటీ దాడుల పేరిట భయబ్రాంతులకు గురి చేస్తోంది. మూడు రోజులుగా ఐటీ శాఖ మంత్రి మల్లా రెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడు, ఇతర బంధువుల ఇళ్ళపై దాడులు చేస్తున్నది. తమ వద్ద ఏమీ దొరకకపోయినా మీడియాకు అబద్దపు లీకులు ఇస్తున్నారని మల్లా రెడ్డి ఆరోపిస్తున్నారు.

మరో వైపు ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి ఆరోగ్యం దిగజారి ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. తన కుమారుడిని సీఆర్ప్పీఎఫ్ పోలీసులు కొట్టారని మల్లా రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి మల్లా రెడ్డి మనవరాలు శ్రేయ రెడ్డిని ఇంటి నుంచి తీసుకెళ్ళారు. బ్యాంకు లాకర్లు తెరవాలంటూ ఆమెను మహిళా పోలీసులు లేకుండా పురుషులైన ముగ్గురు సీఆర్పీఎఫ్ పోలీసులు తీసుకెళ్ళారు. రాత్రి పూట ఓ మహిళను అలా తీసుకెళ్ళడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ మహిళను రాత్రి పూట మహిళా అధికారులు లేకుండా తీసుకెళ్ళొచ్చని ఏ చట్టం చెప్పిందని మల్లా రెడ్డి కుటుంబం ప్రశ్నిస్తోంది. ఉదయందాకా ఆగితే ఆ బ్యాంకు లాకర్లు అక్కడి నుంచి మాయమవుతాయా అని ప్రశ్నలు వస్తున్నాయి.

తమపై వేధింపులకు పాల్పడటంలో భాగంగానే ఐటీ అధికారులు ఇలా ఆడబిడ్డపై దాష్టికానికి పాల్పడ్డారని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోడీ సర్కార్ చేస్తున్న అప్రజాస్వామిక చర్యలపై టీఆరెస్ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ కు నోటీసుల వ్యవహారం బీజేపీని నిలవనియ్యడం లేదని, అందుకే ప్రతీకార దాడులు చేస్తోందని టీఆరెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఓ ఆడబిడ్డను అర్దరాత్రి అవమానించిన తీరును తెలంగాణ సమాజం గుర్తుంచుకుంటుందని, మోడీ సర్కార్ కు సరైన గుణపాఠం నేర్పుతుందని టీఆరెస్ నాయకులు హెచ్చరిస్తున్నారు.

First Published:  24 Nov 2022 2:49 AM GMT
Next Story