Telugu Global
Telangana

ద‌మ్ముంటే మీరు పార్ల‌మెంట్‌ను ర‌ద్దు చేయండి, మేము అసెంబ్లీ రద్దు చేస్తాం, ముంద‌స్తుకు వెళ్దాం... బీజేపీకి కేటీఆర్ స‌వాల్

ఈ రోజు మంత్రి కేటీఆర్ నిజామాబాద్ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ''కేంద్ర పథకాలకు కేసీఆర్ పేర్లు మారుస్తున్నాడని ఓ బీజేపీ నాయకుడు ఆరోపిస్తాడు. నిజం ఏంటి ? మిష‌న్ భ‌గీర‌థ‌, రైతు వేదిక‌లు, ఇంటింటికి న‌ల్లా, దళిత బంధు వంటి ప‌థ‌కాలు దేశంలో ఎక్క‌డైనా ఉన్నాయా? '' అని ప్రశ్నించారు.

ద‌మ్ముంటే మీరు పార్ల‌మెంట్‌ను ర‌ద్దు చేయండి, మేము అసెంబ్లీ రద్దు చేస్తాం, ముంద‌స్తుకు వెళ్దాం... బీజేపీకి కేటీఆర్ స‌వాల్
X

భారతీయ జనతా పార్టీ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ద్వజమెత్తారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు, రాష్ట్రానికి రావాల్సిన హక్కులను కేంద్రం నుండి సాధించే దమ్ము లేదని, కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ది కార్యక్రమాలకు మాత్రం అడ్డుతగులుతున్నారని కేటీఆర్ మ‍ండి పడ్డారు. మీకు దమ్ముంటే పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రండి, మేము కూడా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వస్తాం ఎవరేంటో తేలిపోతుంది అని కేటీఆర్ సవాల్ విసిరారు.

ఈ రోజు మంత్రి కేటీఆర్ నిజామాబాద్ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ''కేంద్ర పథకాలకు కేసీఆర్ పేర్లు మారుస్తున్నాడని ఓ బీజేపీ నాయకుడు ఆరోపిస్తాడు. నిజం ఏంటి ? మిష‌న్ భ‌గీర‌థ‌, రైతు వేదిక‌లు, ఇంటింటికి న‌ల్లా, దళిత బంధు వంటి ప‌థ‌కాలు దేశంలో ఎక్క‌డైనా ఉన్నాయా? మీరు పరిపాలిస్తున్న మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల్లో ఉన్నాయా ? ఉత్తమ‌ గ్రామ‌పంచాయ‌తీలు తెలంగాణ‌లోనే ఉన్నాయ‌ని మీరే అవార్డులు ఇస్తారు. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో మ‌న మున్సిపాలిటీలకు అవార్డులు ఇస్తారు. ఢిల్లీలో ఉండేవారేమో అవార్డులు ఇస్తారు.. గ‌ల్లీలో ఉండేవారేమో కారుకూత‌లు కూస్తారు. ప‌నికిమాలిన మాట‌లు మాట్లాడుతారు.. అయితే ఢిల్లీలో ఉన్నోడికైనా బుద్ధి లేదు.. లేదంటే గ‌ల్లీలో ఉన్నోడికైనా బుద్ధి లేదు. తెలంగాణ అభివృద్ధి న‌మూనా భార‌త‌దేశంలో ఎక్క‌డైనా ఉందా?'' అని కేటీఆర్ ద్వజమెత్తారు.

''మరొకాయనేమో కేసీఆర్ తెలంగాణను అప్పులపాలు చేశాడని కారుకూతలు కూస్తాడు.2014కు కంటే ముందు దేశంలో 14 మంది ప్ర‌ధాన‌మంత్రులు, 67 ఏండ్ల‌లో చేసిన అప్పు రూ. 56 ల‌క్ష‌ల కోట్లు.. కానీ న‌రేంద్ర మోదీ ఈ 8 ఏండ్ల‌లో రూ. 100 ల‌క్ష‌ల కోట్లు అప్పు చేశారు. ల‌క్ష‌ల కోట్లు అప్పు చేసిన మోదీ.. ఒక్క నిర్మాణాత్మక‌ ప‌ని కూడా చేయ‌లేదు. మేము అప్పుల‌ను ఉత్పాద‌క రంగంలో పెట్టుబ‌డుల రూపంలో పెట్టాం. మేం మీలాగా కార్పొరేట్ స్నేహితుల‌కు దోచి పెట్ట‌లేదు'' అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు పార్లమెంటులో పెట్టబోయే బడ్జెట్ నరేంద్ర మోడీకి చివరి బడ్జెట్ కానుందని కేటీఆర్ అన్నారు.

First Published:  28 Jan 2023 2:56 PM GMT
Next Story