Telugu Global
Telangana

ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశ సంపద పెరగదు, మరొకరికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదు -కేటీఆర్

మోడీగారూ, ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశ సంపద పెరగదు, మరొక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. గుజరాత్ కు గత ఐదు నెలల్లో ₹80,000 కోట్ల ప్యాకేజీలు ఇచ్చారు. మా తెలంగాణకు కనీసం ₹18,000 కోట్లు ఇవ్వలేరా? అని ప్రశ్నించారు కేటీఆర్.

ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశ సంపద పెరగదు, మరొకరికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదు -కేటీఆర్
X

బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోడీ పై తెలంగాణ ఐటీ పంచాయత్ రాజ్ శాఖా మంత్రి కేటీఆర్ మరో సారి ద్వజమెత్తారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి బీజేపీలో చేర్చుకున్న విషయంపై కొద్ది రోజులుగా విమర్శలు గుప్పిస్తున్న కేటీఆర్ మరోసారి వరస ట్వీట్లు చేశారు.

అదానీ, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లను ప్రస్తావించకుండానే విమర్శలు వాళ్ళపైన‌ ఎక్కుబెట్టారు.

''ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశ సంపద పెరగదు, మరొక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదు

రాజకీయ ప్రయోజనం కాదు, నల్గొండ జనం ప్రయోజనం ముఖ్యం మోడీ గారూ

గుజరాత్ కు గత ఐదు నెలల్లో ₹80,000 కోట్ల ప్యాకేజీలు ఇచ్చారు.మా తెలంగాణకు కనీసం ₹18,000 కోట్లు ఇవ్వలేరా?'' అని ట్వీట్ చేశారు కేటీఆర్.

మరో పోస్ట్ లో ...

''నీతి ఆయోగ్ ఫ్లోరోసిస్ నిర్మూలన‌ కోసం మిషన్ భగీరథకి 19,000 కోట్లు కేటాయించమని సిఫార్సు చేస్తే పెడచెవిన పెట్టారు

రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికి 18,000 కోట్లు కాంట్రాక్టు ఇచ్చారు.

మోడీ గారూ, ఇప్పటికైనా నల్గొండ జిల్లాకు ₹18,000 కోట్ల ప్యాకేజి ప్రకటిస్తే పోటీనుండి తప్పుకుంటాం. బీజేపీ సిద్ధమా?'' అని మరో ట్వీట్ చేశారు కేటీఆర్.

First Published:  12 Oct 2022 7:23 AM GMT
Next Story