Telugu Global
Telangana

హరీష్‌రావు వస్తే దేవాదాయ శాఖ ఇస్తాం - రాజగోపాల్ రెడ్డి

హరీష్‌ రావు కాంగ్రెస్‌లోకి వస్తే బీఆర్ఎస్‌ హయాంలో చేసిన పాపాలు కడుక్కోవడానికి దేవాదాయ శాఖ ఇస్తామన్నారు రాజగోపాల్ రెడ్డి.

హరీష్‌రావు వస్తే దేవాదాయ శాఖ ఇస్తాం - రాజగోపాల్ రెడ్డి
X

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో మీడియాతో చిట్‌చాట్ చేసిన రాజగోపాల్ రెడ్డి.. హరీష్‌ రావు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. హరీష్‌ రావు బీఆర్ఎస్‌లో చాలా కష్టపడుతున్నారని.. కేటీఆర్‌కు పార్టీని నడపడం రావట్లేదన్నారు. హరీష్ ఎంత కష్టపడినా బీఆర్ఎస్‌లో భవిష్యత్ ఉండదన్నారు రాజగోపాల్ రెడ్డి.

హరీష్‌ రావు కాంగ్రెస్‌లోకి వస్తే బీఆర్ఎస్‌ హయాంలో చేసిన పాపాలు కడుక్కోవడానికి దేవాదాయ శాఖ ఇస్తామన్నారు రాజగోపాల్ రెడ్డి. అయితే కాంగ్రెస్‌లోకి వ‌చ్చేట‌ప్పుడు రాజ్యంగబద్ధంగా 26 మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను తన వెంట తీసుకుని రావాలన్నారు. అలా అయితేనే హరీష్‌ను కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకుంటామంటూ కామెంట్ చేశారు.

హరీష్ రావు, కడియం శ్రీహరి కాంగ్రెస్‌ను చీల్చడానికి ప్రయత్నిస్తున్నారన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కడియం, హరీష్‌లా తాము జీ హుజూర్ బ్యాచ్ కాదన్నారు. బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలంటూ కామెంట్స్ చేశారు. ఇక అసెంబ్లీలోనూ హరీష్‌ రావు , కోమటిరెడ్డి బ్రదర్స్‌ మధ్య డైలాగ్ వార్ నడిచింది.

First Published:  12 Feb 2024 2:03 PM GMT
Next Story