Telugu Global
Telangana

కాంగ్రెస్ వస్తే కుంభకోణాల కుంభమేళానే : మంత్రి కేటీఆర్

50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇక్కడ చేసింది ఏమి ఉన్నది.. అవే పాత ముఖాలు పెట్టుకొని నియోజకవర్గాని వస్తారు.

కాంగ్రెస్ వస్తే కుంభకోణాల కుంభమేళానే : మంత్రి కేటీఆర్
X

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు.. ఆ పార్టీ మరో సారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కుంభకోణాలే ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ చేయబోయేది రైతు మేళా కాదు కుభకోణాల మేళానే అని మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా జిల్లా పర్యటనలో పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభం, శంకుస్థాపనలు చేసిన మంత్రి కేటీఆర్ అక్కడే జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతూ..

50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇక్కడ చేసింది ఏమి ఉన్నది.. అవే పాత ముఖాలు పెట్టుకొని నియోజకవర్గాని వస్తారు. అంతే తప్ప వాళ్లు ప్రజలకు చేసేది ఏమీ ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ వాళ్లు గడప గడపకు అంటూ వస్తున్నారు.. ఇంతకు వాళ్లు గడప గడపకు ఏం ముఖం పెట్టుకొని వస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఎప్పుడు వచ్చినా అదే షబ్బీర్ అలీ.. మరి కొంత మంది నాయకులు.. అంతే తప్పా కొత్తగా పనులు చేసే వాళ్లు ఎవరూ ఉండరని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.

నిన్నటి వరకు మనకు కరెంటు ఇవ్వకుండా, నీళ్లు ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ వాడు వచ్చి.. ఇవ్వాళ మరోసారి అధికారం ఇవ్వాలని అడుగుతున్నాడు. ఒకనాడు కుంభకోణాల్లో మునిగిపోయిన కాంగ్రెస్ వచ్చి.. ఇవ్వాళ తెలంగానను అభివృద్ధి చేస్తామని చెబుతోంది. ఇలాంటి కుంభమేళాల ప్రభుత్వం మనకు అవసరమా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణలో రైతు బంధు, 24 గంటల నిరంతర విద్యుత్, రైతు బీమా అంటూ రైతులకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాము. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం ఎంతో మంది లబ్ది పొందారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, రూ.1 లక్ష ఆర్థిక సాయం బీసీ కుల వృత్తుల వారికి, గొల్లకురుములకు జీవాలు, మత్స్య కారులకు సాయం, వైద్యంలో ఎంతో అభివద్ధి ఇలా ఎన్నో పథకాలు చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వమే. ఇంకా చెప్పాలంటే రాస్తే రామాయణమంతా.. వింటే భాగవతం అంత ఉంటుందని కేటీఆర్ చెప్పారు.

సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు మీరు చూడలేదా... ఏ వర్గానికి మీరు చేసిన మేలు జరగలేదని కేటీఆర్ ప్రశ్నించారు. దేశ చరిత్రలో బీడీ కార్మికులకు, టేకేదార్లకు కూడా పెన్షన్ ఇస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేసిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. రేపు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ వాళ్లు మళ్లీ వస్తారు.. మళ్లీ వచ్చి అడుగుతరు.. కానీ.. మీరే ఎవరికి ఓటు వేయాలో గుర్తుంచుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఎల్లారెడ్డిలో సురేందర్‌ను గెలిపించండి..

ఎల్లారెడ్డిలో సురేందర్‌ను గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. నేను అప్పట్లో అమెరికాలో ఉండగా మా నాన్న (కేసీఆర్)తో వెంట ఉన్నది సురేందరే అని కేటీఆర్ చెప్పారు. 2001లో జెండా కట్టాలంటే మన తెలంగాణలో కూడా చాలా భయం ఉండేది. ఆనాడు ఒకవైపు కాంగ్రెస్, మరో వైపు టీడీపీ, బీజేపీ ఉన్నా సరే సురేందర్ ఎల్లారెడ్డిలో ధైర్యంగా జై తెలంగాణ అన్నారని కేటీఆర్ చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి నుంచి ఉన్న సురేందర్‌ను గెలిపించాలి.. అలాగే ఉమ్మడి నిజామాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు. రాబోయే ఎన్నికల్లో సురేందరే ఇక్కడి నుంచి పోటీ చేస్తాను.. గతంలో కంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

కామారెడ్డి నిజయోజకవర్గంలో రూ.28కోట్లతో నిర్మించిన ఆరు లేన్ల రోడ్లు, స్వాగత తోరణం, సెంట్రల్ లైటింగ్, మీడియన్, రోడ్డు డివైడర్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.


First Published:  14 Aug 2023 10:32 AM GMT
Next Story