Telugu Global
Telangana

భాగ్యలక్ష్మి ఆలయంలో నేను ప్రమాణం చేస్తా, నువ్వు చేస్తావా? ... ఈటల కు రేవంత్ సవాల్

నేను డబ్బులు తీసుకోలేదని, బీజేపీ బాగా నమ్మే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో తడి బట్టలతో ప్రమాణం చేస్తానన్న రేవంత్ రెడ్డి. ఈటల కూడా ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల‌కు తాను భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తానని, దమ్ముంటే ఈటల రాజేందర్ కూడా రావాలని రేవంత్ సవాల్ విసిరారు.

భాగ్యలక్ష్మి ఆలయంలో నేను ప్రమాణం చేస్తా, నువ్వు చేస్తావా? ... ఈటల కు రేవంత్ సవాల్
X

భాగ్యలక్ష్మి ఆలయంలో నేను ప్రమాణం చేస్తా, నువ్వు చేస్తావా? ... ఈటల కు రేవంత్ సవాల్

మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీని ఓడించడానికి, బీఆరెస్ ను గెలిపించడానికి తాను బీఆరెస్ నుండి డబ్బులు తీసుకున్నాన‌న్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపణలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

తాను డబ్బులు తీసుకోలేదని, బీజేపీ బాగా నమ్మే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో తడి బట్టలతో ప్రమాణం చేస్తానన్న రేవంత్ రెడ్డి.. ఈటల కూడా ప్రమాణం చేస్తారా..? అని ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల‌కు తాను భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తానని, దమ్ముంటే ఈటల రాజేందర్ కూడా రావాలని రేవంత్ సవాల్ విసిరారు.

మునుగోడు ఉప ఎన్నిక‌లో ఖర్చుపెట్టిన ప్రతీ పైసా తమ పార్టీదేనని చెప్పిన రేవంత్, కాంగ్రెస్ లోని ముఖ్యనేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఇతర ముఖ్యనాయకుల సమక్షంలో ప్రతి పైసా కార్యకర్తలే ఇచ్చారని, తాము ఎన్నికల్లో పెట్టిన ఖర్చంతా కార్యకర్తలు, అభిమానులు సమకూర్చిందేనని స్పష్టం చేశారు.

తాను గానీ, తన పార్టీ నాయకులు గానీ.. కేసీఆర్ నుంచి కానీ, ఇతర బీఆరెస్ నాయకులనుంచి కానీ, ఒక్క పైసా తీసుకోలేదని, ఈటల రాజేందర్ దిగజారి ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.

First Published:  21 April 2023 1:26 PM GMT
Next Story