Telugu Global
Telangana

నాకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో 'లింక్డ్ఇన్' అంటేనే ఇష్టం : మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ ఆరు నెలల క్రితమే లింక్డ్ఇన్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేశారు. కేటీఆర్‌కు సంబంధించి మిగతా సోషల్ మీడియాల్లో లేని పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది.

నాకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లింక్డ్ఇన్ అంటేనే ఇష్టం : మంత్రి కేటీఆర్
X

తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. 'Tech savvy' అయిన కేటీఆర్.. సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉంటారు. మంత్రిగా తాను చేస్తున్న పనులతో పాటు, పర్సనల్ విషయాలను కూడా ఈ ప్లాట్‌ఫామ్స్‌పై షేర్ చేస్తుంటారు. ఎవరైనా సాయం అడిగినా వెంటనే స్పందిస్తుంటారు.

Advertisement

ఇక కేంద్రంలోని బీజేపీ అసమర్థ పాలనను ట్విట్టర్‌లో ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉంటారు. గతంలో ట్విట్టర్‌లో @KTRTRS పేరుతో ఉన్న అకౌంట్‌ను కొన్నాళ్ల క్రితమే @KTRBRSగా మార్చారు. తాజాగా అకౌంట్ నేమ్ మారిన దానికి బ్లూ టిక్ కూడా వచ్చేసింది. అయితే, ఇన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో యాక్టీవ్‌గా ఉండే కేటీఆర్‌కు మాత్రం ' లింక్డ్ఇన్' ఇష్టమని చెప్పారు. మిగతా సామాజిక వేదికల్లో లేని పాజిటివ్ ఎనర్జీ ఈ లింక్డ్ఇన్‌లో ఉంటుందని.. దీన్ని నేను అందుకే ఇష్టపడుతున్నట్లు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Advertisement

మంత్రి కేటీఆర్ ఆరు నెలల క్రితమే లింక్డ్ఇన్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేశారు. కేటీఆర్‌కు సంబంధించి మిగతా సోషల్ మీడియాల్లో లేని పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది. ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పని చేశారు.. ఎమ్మెల్యేగా ఎప్పటి నుంచి ఉన్నారు... మంత్రిగా ఎప్పటి నుంచి పని చేస్తున్నారనే విషయాలను ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో రాసుకున్నారు.

నిజాం కాలేజీలో 1996లో కేటీఆర్ మైక్రోబయాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. 1998లో సావిత్రీబాయి పూలే పూణే యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ మైక్రోబయాలజీ పూర్తి చేశారు. 2001 నుంచి 2006 వరకు ఐఎన్‌టీటీఆర్ఏ సంస్థలో రీజనల్ సేల్స్ డైరెక్టర్‌గా పని చేసినట్లు ప్రొఫైల్‌లో పొందు పరిచారు. ఇక ఆ తర్వాత 2009 నుంచి 2014 వరకు తొలి సారి ఎమ్మెల్యేగా ఉన్నారు.

2014-16 మధ్య ఐటీ, పంచాయతి రాజ్, రూరల్ డెవలప్‌మెంట్ మినిస్టర్‌గా.. 2016-18 మధ్య ఐటీ, మున్సిపల్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, మైనింగ్, ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రిగా పని చేసినట్లు తెలిపారు. ఇక 2019 నుంచి ఇప్పటి వరకు ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్టర్‌గా పని చేస్తున్నట్లు లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో పొందు పరిచారు. తాజాగా జరుగుతున్న బయో ఆసియా 2023 సదస్సు గురించిన అప్డేట్స్ కూడా లింక్డ్‌ఇన్‌లో రాశారు. కేటీఆర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసి, ఫాలో చేయాలంటే కింద ఉన్న ట్విట్టర్ లింక్‌ను క్లిక్ చేయండి.


Next Story