Telugu Global
Telangana

ప్రజలకు నా సర్టిఫికెట్లు చూపించగలను.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ కౌంటర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ప్రధాని మోడీకి కౌంటర్ ఇచ్చారు. నా సర్టిఫికెట్లు చూపించగలనంటూ ట్వీట్ చేశారు.

ప్రజలకు నా సర్టిఫికెట్లు చూపించగలను..  ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ కౌంటర్
X

ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ చదివారు, ఆయన డిగ్రీ సర్టిఫికెట్లు ఏవనే చర్చ దేశమంతటా మొదలైంది. మోడీ సర్టిఫికెట్లు చూపించేలా పీఎంవోను ఆదేశించాలని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ గుజరాత్ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను కొట్టేయడమే కాకుండా.. రూ.25 వేల జరిమానా కూడా విధించింది. తాము సర్టిఫికెట్లు బయట పెట్టమని పీఎంవోను ఆదేశించలేమని కోర్టు పేర్కొన్నది. ఈ తీర్పు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చదివితే సర్టిఫికెట్లు బయట పెట్టడానికి ఏం కష్టం వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక కొంత మంది డిగ్రీచాలెంజ్ అంటూ తమ సర్టిఫికెట్లను ఫొటో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ప్రధాని మోడీకి కౌంటర్ ఇచ్చారు. నా సర్టిఫికెట్లు చూపించగలనంటూ ట్వీట్ చేశారు. తాను పూణే యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ, సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో బిజినెస్‌లో మాస్టర్ డిగ్రీ చేసినట్లు వెల్లడించారు. అవసరం అయితే సంబంధిత సర్టిఫికెట్లను పబ్లిక్‌గా షేర్ చేస్తా.. మీరే మంటారు.. అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

కాగా, మోడీ చెప్పినవన్నీ అబద్దాలే అని సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆయన చాయ్ అమ్మిన అని చెప్పిన రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలియదు. ఆయన మొసలి పిల్లను ఇంటికి తెస్తాడు.. ఏ ప్లస్ బి హోస్ స్క్వేర్‌లో టూ ఏబీ ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తాడు. గ్లోబల్ వార్మింగ్ కాదు.. మన ఏజ్ పెరుగుతుందని పిల్లలకు చెబుతాడు. గట్టర్ నుంచి గ్యాస్ తీయవచ్చని అంటాడు.. ఆయన ఏకంగా ఎంటైర్ పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేశానని చెప్పుకుంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని అందరూ పోస్టులు పెడుతున్నారు.

First Published:  1 April 2023 12:44 AM GMT
Next Story