Telugu Global
Telangana

ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య.. చివరికి ఆ ప్రియుడి వల్లే..

ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, భవిష్యత్తులో సమస్య వస్తుందేమో అన్న ఆలోచనతో భర్తను దారుణంగా హతమార్చింది.

ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య.. చివరికి ఆ ప్రియుడి వల్లే..
X

ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, భవిష్యత్తులో సమస్య వస్తుందేమో అన్న ఆలోచనతో భర్తను దారుణంగా హతమార్చింది. తరువాత గుండెపోటుతో చనిపోయాడని డ్రామా ఆడి, అనుమానం రాకుండా దహన సంస్కారాలు కూడా పూర్తి చేసింది. ఇదంతా జరిగి 3 నెలలు గడచిపోయింది. ఎవరికీ అనుమానం కూడా రాలేదు. అయితే హత్య చేసిన నిందితుల్లో ఒకరు పోలీసుల వద్ద లొంగిపోవడంతో మొత్తం ఈ కధ అంతా బయటపడింది.

హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ జయప్రకాశనగర్ శిఖర అపార్డ్ మెంట్ లో నివాసం ఉండే సీసీ కెమెరా టెక్నీషియన్ విజయ్ కు భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. శ్రీలక్ష్మి పెళ్లికి ముందు రాజేశ్​ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి తర్వాత అది వివాహేతర సంబంధంగా మారి కొనసాగుతోంది. ఈ విషయం ఎప్పటికైనా తన భర్తకు తెలిస్తే ఇబ్బందేనని భావించిన శ్రీ లక్ష్మీ , విజయ్ ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.

ఇందుకు రాజేశ్​ కూడా సరేనన్నాడు. ఇందుకోసం రాజేష్ సనత్​నగర్​కు చెందిన పటోళ్ల రాజేశ్వర్ ​రెడ్డి మద్దతు కోరాడు. రౌడీషీటర్ అయిన రాజేశ్వర్ ​రెడ్డిపై ఇదివరకే పలు కేసులు ఉన్నాయి. ఇక గత ఫిబ్రవరి 1న వీరంతా కలిసి వేసిన ప్లాన్ ను అమలు చేశారు. ఉదయం పిల్లలిద్దర్ని స్కూల్లో దిగబెట్టేందుకు విజయ్ ఇంటి నుంచి బయటకు వెళ్లగానే, రాజేశ్వర్రెడ్డి, బబ్బన్ను శ్రీలక్ష్మి ఇంటికి పిలిపించి బాత్రూంలో దాచిపెట్టింది. భర్త ఇంటికి రాగానే తలుపులు మూసేసి బాత్రూంనుంచి వారిని బయటకు రప్పించింది. వారు వెంటనే విజయకుమార్ తలపై డంబెల్స్ తో కొట్టడంతో విజయకుమార్ కింది పడిపోయాడు. అంతటితో ఆగని దుండగులు విజయ్ గొంతు నులిమి చంపి, బాత్రూంలో పడేసి ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాత్రూంకి వెళ్లిన భర్తకు గుండెపోటు వచ్చి, గోడ తలకు తగిలి చనిపోయాడని నమ్మించింది బంధువులను పిలిపించి శ్రీనగర్ కాలనీలోని శ్మశాన వాటికలో అదే రోజు దహన సంస్కారాలు పూర్తి చేసింది శ్రీ లక్ష్మీ.

విషయం ఎలా బయటపడింది అంటే..

విజయ్ హత్య అనంతరం ప్రియుడు రాజేశ్వర్ రెడ్డి వికారాబాదాద్ వెళ్లిపోయాడు. సుమారు మూడున్నర నెలలపాటు అజ్ఞాతంలోనే ఉండిపోయాడు. అయితే విజయ్​ను కొడుతుండగా తనను చంపొద్దని వేడుకోవడం తనకు పదే పదే గుర్తుకొచ్చి, పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. హత్య చేసినప్పటి నుంచి తనకు మనఃశాంతి లేకుండా పోయిందని, అందుకే నేరాన్ని అంగీకరిస్తున్నానని రాజేశ్వర్రెడ్డి మంగళవారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.అతడు ఇచ్చిన సమాచారంతో శ్రీలక్ష్మి, రాజేశ్, బబ్బన్ లను పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసుతో పాటు సాక్ష్యాలు లేకుండా చేసినందుకు సెక్షన్లు 302, 201 కింద కేసు నమోదు చేశారు. తండ్రి హత్య..తల్లి జైలు పాలు కావటంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు.

First Published:  17 May 2024 7:07 AM GMT
Next Story