Telugu Global
Telangana

మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ: HCUలో ప్రదర్శన...అధికారుల విచారణ‌

HCUలో విద్యార్థులు బీబీసీ డాక్యుమెంటరీని క్యాంపస్‌లో ప్రదర్శించారని ఆరోపిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సోమవారం అధికారులకు ఫిర్యాదు చేసింది.

మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ: HCUలో ప్రదర్శన...అధికారుల విచారణ‌
X

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ సంచలనం సృష్టిస్తోంది. గుజరాత్ మతకలహాలకు సంబంధించి మోడీ పాత్రపై ఈ డాక్యుమెంటరీ వివరిస్తోంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ సెంటల్ యూనివర్సిటీలో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శించారన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.

'ఇండియా: ది మోడీ క్వశ్చన్' పేరుతో బీబీసీ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ, 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో గుజరాత్ ప్రభుత్వం గురించి తప్పుగా నివేదించిందని కేంద్రం ఆరోపిస్తోంది. I&B మంత్రిత్వ శాఖ యూట్యూబ్‌లోని బీబీసీ డాక్యుమెంటరీ సిరీస్‌ను బ్లాక్ చేసింది. YouTube కూడా ఆ లింక్‌లను తొలగించింది.

అయితే HCUలో విద్యార్థులు బీబీసీ డాక్యుమెంటరీని క్యాంపస్‌లో ప్రదర్శించారని ఆరోపిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సోమవారం అధికారులకు ఫిర్యాదు చేసింది.

పిర్యాదు అందిందని విచారణకు ఆదేశించామని భద్రతా విభాగం నుండి నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

మరోవైపు, HCU విద్యార్థి సంఘం డాక్యుమెంటరీ ప్రదర్శన‌ను సమర్దించుకుంది. తాము చట్టవ్యతిరేకంగా ఏమీ చేయలేదని విద్యార్థులు చెప్తున్నారు. కేంద్ర బీబీసీ డాక్యుమెంటరీని నిషేదించడానికన్నా రెండురోజుల‌ ముందు దాన్ని ప్రదర్శించామని వారు చెప్తున్నారు.

గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్క్రీనింగ్‌కు సంబంధించి ఇంకా ఎటువంటి ఫిర్యాదు అందలేదు.

First Published:  24 Jan 2023 2:38 AM GMT
Next Story