Telugu Global
Telangana

జంట నగరాల్లో నిమజ్జనం రోజు ప్రభుత్వ సెలవు

వినాయక నిమజ్జనం సందర్భంగా శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జంట నగరాలతోపాటు, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈ సెలవు వర్తిస్తుంది.

జంట నగరాల్లో నిమజ్జనం రోజు ప్రభుత్వ సెలవు
X

వినాయక నిమజ్జనం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతోపాటు, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల్లో కూడా శుక్రవారం సెలవు ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు వర్తిస్తుందని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. శుక్రవారం అధికారికంగా సెలవు కావడంతో ఆ తర్వాతిరోజు రెండో శనివారం, మరుసటి రోజు ఆదివారం.. ఇలా మూడు రోజులు వరుస సెలవలు వస్తాయి.

నవంబర్ లో రెండో శనివారం వర్కింగ్ డే..

శుక్రవారం సెలవు ఇస్తున్న సందర్భంగా దీనికి కాంపెన్సేషన్ గా నవంబర్ లో రెండో శనివారాన్ని వర్కింగ్ డే గా ప్రకటించారు. ప్రస్తుతం సెలవు ప్రకటించిన ప్రాంతాల్లో నవంబర్-12 న రెండో శనివారం వర్కింగ్ డే గా ఉంటుంది. ఆరోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు, విద్యాసంస్థలు కూడా యథావిధిగా నడుస్తాయి. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వ చీప్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు.

First Published:  8 Sep 2022 10:33 AM GMT
Next Story