Telugu Global
Telangana

నేరుగా చూసిన అనుభూతి.. ఆన్ లైన్ లో సాలార్ జంగ్ మ్యూజియం

‘గూగుల్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌’ ప్రాజెక్టులో భాగంగా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు మ్యూజియం డైరెక్టర్‌ ఎ.నాగేందర్‌ రెడ్డి. మ్యూజియాన్ని నేరుగా సందర్శించడానికి అవకాశం లేనివారు, ఒకేసారి అంత సమయాన్ని వెచ్చించలేనివారు ఇంటర్నెట్ లో నింపాదిగా నిదానంగా దీన్ని చూసేయొచ్చు.

నేరుగా చూసిన అనుభూతి.. ఆన్ లైన్ లో సాలార్ జంగ్ మ్యూజియం
X

హైదరాబాద్ టూర్ వెళ్తే కచ్చితంగా సాలార్ జంగ్ మ్యూజియాన్ని చూడాల్సిందే. హైదరాబాద్ వెళ్లిన ప్రతిసారీ మ్యూజియంను చూసేందుకు వెళ్లేవారు చాలామందే ఉంటారు. రోజు మొత్తం సమయం ఇచ్చినా మ్యూజియంలోని ప్రతి వస్తువునీ మనం తనివితీరా చూడలేం. ఉన్నచోటే ఉండాలనిపిస్తుంది, చూసిన దాన్నే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అలాంటి మ్యూజియం ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్లకుండానే ఆన్ లైన్ లో ఉచితంగా చూసే అవకాశం కల్పించారు అధికారులు. ఇంటర్నెట్ లో సాలార్ జంగ్ మ్యూజియం త్రీడీ టూర్ ని వీక్షించే సదుపాయం తీసుకొచ్చారు.

ఆన్ లైన్ లో సాలార్ జంగ్ మ్యూజియాన్ని ఎవరైనా ఉచితంగా చూడొచ్చు. లింక్ పై క్లిక్ చేస్తే చాలు అందులో ఫొటోలు ప్రత్యక్షం అవుతాయి. మ్యూజియంలో ప్రతి గదికి సంబంధించిన త్రీడీ ఫొటోలు ఉంటాయి. వీటిని 360 డిగ్రీల్లో ఎటునుంచైనా చూడొచ్చు. మ్యూజియంలో మనం నడచి వెళ్తున్న అనుభూతి కలుగుతుంది. అసలు మ్యూజియాన్ని నేరుగా చూసిన అనుభూతి కలుగుతుందంటే నమ్మండి.

మ్యూజియంలో భద్రపరచిన అరుదైన వస్తువులు, చిత్రాలు, మ్యూజియం చరిత్రను ‘గూగుల్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌’ ప్రాజెక్టులో భాగంగా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు మ్యూజియం డైరెక్టర్‌ ఎ.నాగేందర్‌ రెడ్డి. మ్యూజియాన్ని నేరుగా సందర్శించడానికి అవకాశం లేనివారు, ఒకేసారి అంత సమయాన్ని వెచ్చించలేనివారు ఇంటర్నెట్ లో నింపాదిగా నిదానంగా దీన్ని చూసేయొచ్చు.

డిజిటల్‌ వెర్షన్‌ లో అరుదైన, పురాతన శిల్పాలు, చిత్రాలు, రాజులు ధరించిన వినూత్న దుస్తులు, రాజులు ఉపయోగించిన కత్తులు, వారు వాడిన వస్తువులు వాటికి సంబంధించిన వివరాలు, చిత్రాలను నిక్షిప్తంచేశారు. భారతదేశ చరిత్రకు సంబంధించిన 467 ముఖ్యమైన చిత్రాలు, హైదరాబాద్‌ చరిత్రకు సంబంధించి 387 చిత్రాలు, ఫైబర్‌ ఆర్ట్‌ తదితర వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.

https://artsandculture.google.com/partner/salar-jung-museum

ఈ లింక్ పైన క్లిక్ చేస్తే నేరుగా సాలార్ జంగ్ మ్యూజియంలోకి ఎంట్రీ టికెట్ లేకుండానే మీరు ఎంట్రీ ఇచ్చినట్టు లెక్క.



First Published:  21 March 2023 6:41 AM GMT
Next Story