Telugu Global
Telangana

దేశంలోని మెట్రో నగరాలన్నింటికన్నా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అత్యంత సరసమైనది

ప్రాపర్టీ కన్సల్టెంట్ 'అనరాక్' తాజాగా విడుదల చేసిన నివేదిక, ఢిల్లీ-ఎన్‌సిఆర్, కోల్‌కతా, ముంబై, పూణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో సగటు ఆస్తి ధరలను పోల్చింది. హైదరాబాద్‌లో సగటు ప్రాపర్టీ ధర చ.అ.కు రూ.4,620 అని, ఇది ఇతర నగరాల్లోని సగటు ప్రాపర్టీ ధరల కంటే చాలా తక్కువగా ఉందని తెలిపింది.

దేశంలోని మెట్రో నగరాలన్నింటికన్నా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అత్యంత సరసమైనది
X

గృహావసరాలకు పెరుగుతున్న డిమాండ్, బలమైన ఆర్థిక వృద్ధి, అన్ని రంగాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కారణాలతో ప్రాపర్టీ ధరలు పెరుగుతున్నప్పటికీ ఆరు ఇతర అగ్ర మెట్రో నగరాలతో పోల్చినప్పుడు హైదరాబాద్ ఆస్తిని కొనుగోలు చేయడానికి సరసమైన నగరంగా నిల్చింది.

ప్రాపర్టీ కన్సల్టెంట్ 'అనరాక్' తాజాగా విడుదల చేసిన నివేదిక, ఢిల్లీ-ఎన్‌సిఆర్, కోల్‌కతా, ముంబై, పూణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో సగటు ఆస్తి ధరలను పోల్చింది. హైదరాబాద్‌లో సగటు ప్రాపర్టీ ధర చ.అ.కు రూ.4,620 అని, ఇది ఇతర నగరాల్లోని సగటు ప్రాపర్టీ ధరల కంటే చాలా తక్కువగా ఉందని తెలిపింది.

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరమైన వేగంతో అభివృద్ది చెందుతోంది. నివాస, వాణిజ్య ఆస్తులకు డిమాండ్ బాగా పెరిగింది. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, కనెక్టివిటీని మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్దికి ముఖ్యమైన పాత్ర పోషించాయి. అంతే కాకుండా ఈ నగరం అనేక ప్రధాన IT కంపెనీలకు నిలయంగా ఉండటం కూడా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్దికి కారణమయ్యింది.

హైదరాబాద్‌లో గత ఐదేళ్లలో సగటు ప్రాపర్టీ ధరల్లో గరిష్టంగా ఐదేళ్లకు 10 శాతం పెరుగుదల నమోదైంది. అయినప్పటికీ భారత్ లోని మెట్రో నగరాలన్నింటికన్నా ఇప్పటికీ తక్కువ ధరల్లోనే ఇక్కడ ప్లాట్ లు, ఫ్లాట్ లు లబ్యమవుతున్నాయి.

2018లో నగరంలో సగటు ధర చదరపు అడుగుకు రూ. 4,128గా ఉంది, ఇది 2022లో రూ. 4,620కి పెరిగింది. బెంగళూరులో సగటు ఆస్తి ధరలు 2022లో రూ. 5,570కి చేరుకోగా, ముంబై రూ.11,875తో అగ్రస్థానంలో ఉంది. పూణే లో రూ. 6,000గా ఉంది.

2022లో సగటు ప్రాపర్టీ ధరల్లో గరిష్ట వార్షిక పెరుగుదల కనిపించిందని, అనరాక్ గ్రూప్‌లోని రీసెర్చ్ సీనియర్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ అన్నారు, “కరోనా మహమ్మారి తర్వాత నగరాల్లో డిమాండ్ బాగా పెరిగింది మరో వైపు డెవలపర్‌ల ఇన్‌పుట్ ఖర్చులు ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి.'' అన్నారు.

ఎక్కువ డిమాండ్, పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు ధరల పెరుగుదలకు ముఖ్యమైన కారణమని, అయినప్పటికీ హైదరాబాద్ లో ధరలు పెద్ద మొత్తంలో పెరగడ‍ంలేదని ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు.

First Published:  22 Feb 2023 3:59 AM GMT
Next Story