Telugu Global
Telangana

రెసిడెన్షియల్ ప్రాపర్టీ విక్రయాల్లో బెంగళూరు, ముంబై కంటే ముందున్న హైదరాబాద్

ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ, ప్రాప్ ఈక్విటీ నివేదిక ప్రకారం, హైదరాబాద్ 66,683 యూనిట్ల కొత్త ప్రాజెక్టులతో బెంగళూరు, ముంబై, నవీ ముంబై, చెన్నైతో సహా ఇతర నగరాలను మించిపోయింది. .

రెసిడెన్షియల్ ప్రాపర్టీ విక్రయాల్లో బెంగళూరు, ముంబై కంటే ముందున్న హైదరాబాద్
X

2022లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మకాలు, కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కావడం... ఈ రెండింటిలోనూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ దేశంలోనే మూడవ స్థానాన్ని సంపాదించింది.

ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ, ప్రాప్ ఈక్విటీ నివేదిక ప్రకారం, హైదరాబాద్ 66,683 యూనిట్ల కొత్త ప్రాజెక్టులతో బెంగళూరు, ముంబై, నవీ ముంబై, చెన్నైతో సహా ఇతర నగరాలను మించిపోయింది. .

81,849 కొత్త ప్రాజెక్టులతో థానే మొదటి స్థానంలో ఉండగా, 69,525 ప్రాజెక్టులతో పూణే రెండవ స్థానంలో ఉంది.

2022లో దేశంలోని టైర్-1 నగరాల్లోని రెసిడెన్షియల్ ప్రాపర్టీ అమ్మకాలు టైర్ 2 నగరాల్లో అమ్మకాలకన్నా 250 శాతం ఎక్కువగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. టైర్ 1 నగరాల్లో మొత్తం అమ్మకాలు 4.53 లక్షల యూనిట్లుగా ఉండగా, టైర్ 2 నగరాల్లో 1.83 లక్షల యూనిట్లు ఉంది.

ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ జసుజా మాట్లాడుతూ, "టైర్-1 నగరాల్లో మెరుగైన జీవన ప్రమాణాలు, మెరుగైన మౌలిక సదుపాయాల కారణంగా ఎక్కువ అమ్మకాలు జరుగున్నాయి." అన్నారు.

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పరిశ్రమ వృద్ధికి అద్భుత స్థాయి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందుతున్న IT పరిశ్రమ, పెరుగుతున్న యువ నిపుణుల జనాభా వంటి అనేక అంశాలు కారణమని చెప్పవచ్చు. రాబోయే సంవత్సరాల్లో నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత వృద్ధి చెందుతుందని, మరిన్ని ప్రాజెక్టులు, కొనుగోలుదారుల నుండి డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు.

First Published:  22 March 2023 2:01 AM GMT
Next Story