Telugu Global
Telangana

గృహ విక్రయాల వృద్ధిలో హైదరాబాద్ టాప్.. 2022 సరికొత్త రికార్డ్

Hyderabad Real Estate: ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్.. ఈ టాప్-7 సిటీస్ ని పరిగణలోకి తీసుకుని దేశవ్యాప్తంగా గృహ అమ్మకాల లెక్కలు తీస్తుంటారు. టాప్-7 సిటీస్ లో గృహ విక్రయాల వృద్ధిలో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉండటం విశేషం.

గృహ విక్రయాల వృద్ధిలో హైదరాబాద్ టాప్.. 2022 సరికొత్త రికార్డ్
X

గృహ విక్రయాల వృద్ధిలో హైదరాబాద్ టాప్.. 2022 సరికొత్త రికార్డ్

2022లో దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు సరికొత్త రికార్డుని చేరుకున్నాయి. ఇప్పటి వరకూ 2014లో జరిగిన అమ్మకాలే అత్యథికం. ఆ ఏడాది దేశంలోని టాప్ 7 నగరాల్లో 3.43 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత మెల్ల మెల్లగా అమ్మకాలు తగ్గాయి. కరోనా ఎంట్రీతో పరిస్థితి దిగజారింది. కానీ ఇప్పుడు మళ్లీ 2022 మార్కెట్ కి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ ఏడాది 3.65 లక్షల యూనిట్లు అమ్ముడైనట్టు ఆన్ రాక్ సర్వేలో తేలింది.

ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్.. ఈ టాప్-7 సిటీస్ ని పరిగణలోకి తీసుకుని దేశవ్యాప్తంగా గృహ అమ్మకాల లెక్కలు తీస్తుంటారు. టాప్-7 సిటీస్ లో గృహ విక్రయాల వృద్ధిలో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉండటం విశేషం. ఏడు నగరాల్లో 2021లో 2,36,500 యూనిట్లు అమ్ముడు కాగా ఈ ఏడాది 3,64,900 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే వృద్ధి 54 శాతం. హైదరాబాద్‌ లో గత ఏడాది 25,406 యూనిట్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది వాటి సంఖ్య 47,487. అంటే వృద్ధి 87శాతం. జాతీయ సగటుకంటే హైదరాబాద్ వృద్ధి చాలా ఎక్కువ.

ఈ ఏడాది ముంబైలో గరిష్టంగా 1,09,700 యూనిట్ల గృహాలు అమ్ముడయ్యాయి. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో అమాంతం పడిపోయిన ఇళ్ల కొనుగోళ్లు ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో పుంజుకుంటున్నాయి. ఇతరత్రా పెట్టుబడులకంటే సొంతింటి కల నెరవేర్చుకోడానికే చాలామంది ఇష్టపడుతున్నారు. లోన్ ద్వారా ఇంటిని తీసుకుని ఆ తర్వాత ఈఎంఐలను కట్టుకోవడమే పెట్టుబడిగా భావిస్తున్నారు.

గృహ నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇటీవల కాలంలో దాదాపుగా ఇంటి నిర్మాణ వ్యయం 40శాతం వరకు పెరిగింది. అదే సమయంలో స్థలాల రేట్లు కూడా పెరుగుతున్నాయి. అంటే ఇంటి రేట్లు భారీగా పెరిగినట్టే లెక్క. పెరుగుతున్న ధరలు, వడ్డీ రేట్ల పెంపు వంటి ప్రతికూలతలు ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ కి 2022 అద్భుతమైన ఏడాది అని అంటున్నారు ఆన్ రాక్ సంస్థ నిర్వాహకులు.

First Published:  27 Dec 2022 12:10 PM GMT
Next Story