Telugu Global
Telangana

అవమానించబడ్డ చోటనే అమరవీరుల స్మారక స్థూపం....అరుదైన స్టెయిన్ లెస్ స్టీలుతో ప్రపంచంలోనే అతిపెద్ద కట్టడం

"తెలంగాణ ప్రజల మదిలో అమరుల త్యాగాలు నిరంతరం జ్వలిస్తూ ఉండేలా, దీపం ఆకృతి వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అమర వీరుల స్మారకం నిర్మాణానికి పూనుకున్నట్టు రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

Hyderabad: Minister Prashanth Reddy Vists Telangana Martyrs Memorial At Hussain Sagar
X

అవమానించబడ్డ చోటనే అమరవీరుల స్మారక స్థూపం....అరుదైన స్టెయిన్ లెస్ స్టీలుతో ప్రపంచంలోనే అతిపెద్ద కట్టడం

"తెలంగాణ ప్రజల మదిలో అమరుల త్యాగాలు నిరంతరం జ్వలిస్తూ ఉండేలా, దీపం ఆకృతి వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అమర వీరుల స్మారకం నిర్మాణానికి పూనుకున్నట్టు రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

ఈ నిర్మాణం అరుదైన స్టెయిన్ స్టీల్ తో నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద కట్టడమని ఆయన వెల్లడించారు. సీఎం కేసిఆర్ గారి నేతృత్వంలో ఎక్కడైతే ప్రత్యేక తెలంగాణ కోసం జలదృశ్యం మీటింగ్ జరిగిందో అదే స్థలంలో నేడు కేసిఆర్ గారి నేతృత్వంలోనే అమరవీరుల స్మారక చిహ్నం నిర్మిస్తున్నామని తెలిపారు.

హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణం తుది దశ పనులను మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ప్రధాన ద్వారం దగ్గర జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగారు. అధికారులు, వర్క్ ఏజెన్సీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా నిర్మాణం పూర్తి కావాలని మంత్రి అధికారులకు,వర్క్ ఏజన్సికి స్పష్టం చేశారు.

జలదృశ్యం, టీఆరెస్ పార్టీ ఏర్పాటును జీర్ణించుకోలేక అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ కార్యాలయంలో సామాన్లు,ఫర్నీచర్ బయట పడేయించారని తెలిపారు. ఎక్కడైతే అవమానించబడ్డమో ఇప్పుడు అదే ప్రాంతంలో కేసీఆర్ గారు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మిస్తున్నారన్నారు. రాష్ట్రానికి అతిథులు,ప్రముఖులు ఎవరు వచ్చినా ఈ స్మారకాన్ని సందర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఈ నిర్మాణం ప్రారంభోత్సవం ఉంటుంది." అని మంత్రి తెలిపారు.

మంత్రి వెంట ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ,ఆర్ అండ్ బి ఈఎన్సి గణపతి రెడ్డి,సి.ఈ మోహన్ నాయక్,ఎస్.ఈ లు లింగారెడ్డి,సత్యనారయణ,హఫీజ్,ఈ.ఈ నర్సింగ రావు, డి.ఈ మాధవి,ఎ.ఈ ధీరజ్, శిల్పి రమణారెడ్డి,కెపిసి నిర్మాణ సంస్థ ప్రతినిధి కొండల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

First Published:  16 May 2023 8:15 PM GMT
Next Story