Telugu Global
Telangana

సమ్మె విరమించిన హైదరాబాద్ మెట్రో రైల్ సిబ్బంది

గత ఐదేళ్ళుగా 11 వేల రూపాయల జీతానికే పని చేస్తున్న టికెటింగ్ సిబ్బంది తమ జీతాన్ని 18 వేలకు పెంచాలంటూ సమ్మెకు దిగారు. రెండు రోజులుగా సమ్మె చేస్తున్న సిబ్బందితో చర్చలు జరిపిన యాజమాన్యం 800 రూపాయలు పెంచుతామని, ఒప్పుకోకపోతే అందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించినట్టు ఉద్యోగులు చెప్తున్నారు.

సమ్మె విరమించిన హైదరాబాద్ మెట్రో రైల్ సిబ్బంది
X

హైదరాబాద్ మెట్రో టికెటింగ్ సిబ్బంది గురువారం తమ సమ్మెను విరమించి తిరిగి విధుల్లో చేరారు. చర్చలు సఫలమయ్యాయని యాజమాన్యం ప్రకటించగా, తప్పనిసరి పరిస్థితుల్లో గతిలేక విధుల్లో చేరుతున్నట్టు ఉద్యోగులు తెలిపారు.

గత ఐదేళ్ళుగా 11 వేల రూపాయల జీతానికే పని చేస్తున్న టికెటింగ్ సిబ్బంది తమ జీతాన్ని 18 వేలకు పెంచాలంటూ సమ్మెకు దిగారు. రెండు రోజులుగా సమ్మె చేస్తున్న సిబ్బందితో చర్చలు జరిపిన యాజమాన్యం 800 రూపాయలు పెంచుతామని, ఒప్పుకోకపోతే అందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించినట్టు ఉద్యోగులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 800 రూపాయల వేతన పెంపుకు ఒప్పుకొని టికటింగ్ సిబ్బంది విధుల్లో చేరిపోయారు.

ఉద్యోగులకు మెట్రో సేవలను ఉచితంగా అందించాలని యాజమాన్యం నిర్ణయించింది

ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ, ''మేం జీతాలు పెంచమని అడిగితే మా ఉద్యోగాలు తీసేస్తామంటున్నారు. మాకు ప్రయాణ భత్యం లేదు. ప్రయాణ భత్యం లేకపోయినా సరే వారు మాకు తగినంత వేతనం చెల్లిస్తే సరిపోతుంది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత రైళ్లు లేకపోవడంతో ఇళ్లకు వెళ్లాలంటే కూడా మేము ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆరోగ్యం బాగాలేక ఒకసారి ఆసుపత్రికి వెళ్తే జేబులు ఖాళీ అవుతాయి. చాలీ చాలని జీతాలతో ఎలా బతకాలి?’’ అని ప్రశ్నించారు.

Next Story