Telugu Global
Telangana

అభిమానులకు కేసీఆర్ భావోద్వేగ సందేశం..వీడియో విడుదల

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు సందేశం విడుదల చేశారు.

అభిమానులకు కేసీఆర్ భావోద్వేగ సందేశం..వీడియో విడుదల
X

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు సందేశం విడుదల చేశారు. యశోద హాస్పిటల్‌కు రావొద్దని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తనతో పాటు హాస్పిటల్‌లో ఉన్న మిగతా పేషంట్లకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్నారు. త్వరలోనే కోలుకుని మీ మధ్యలోకి వస్తానని ఓ వీడియోను రిలీజ్ చేశారు.

తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు గద్గద స్వరంతో చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు కేసీఆర్. తనను చూడడానికి వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు. ఇన్ఫెక్షన్ వస్తుందనే కారణంతోనే తనను డాక్టర్లు బయటకు పంపించట్లేదని వీడియోలో చెప్పారు కేసీఆర్.

ఈ నెల 7న ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో జారిపడటంతో కేసీఆర్‌ ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే ఉంటూ కోలుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.


First Published:  12 Dec 2023 11:54 AM GMT
Next Story