Telugu Global
Telangana

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు దక్షిణాసియాలోనే అత్యుత్తమ ప్రాంతీయ ఎయిర్‌పోర్ట్‌ గా గుర్తింపు

స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్‌లు విమానాశ్రయ పరిశ్రమకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు. 550కి పైగా విమానాశ్రయాలలో కస్టమర్ సేవ, సౌకర్యాలను అంచనా వేస్తూ ఈ సర్వే జరిగింది. కస్టమర్ల ఓట్ల ద్వారా ఈ ఎంపిక జరిగింది

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు  దక్షిణాసియాలోనే అత్యుత్తమ ప్రాంతీయ ఎయిర్‌పోర్ట్‌ గా గుర్తింపు
X

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA), 2023 స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డులలో ‘భారతదేశం, దక్షిణాసియాలోని ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయం’గా ఎంపికైంది. భారతదేశం, దక్షిణాసియాలో 'ఉత్తమ విమానాశ్రయ సిబ్బంది' అవార్డును కూడా గెలుచుకున్నట్లు GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL)గురువారం ప్రకటించింది.

ప్రదీప్ పనికర్, CEO-GHIAL మాట్లాడుతూ, "ఈ అవార్డును అందుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము." అన్నారు. స్కైట్రాక్స్ సీఈఓ ఎడ్వర్డ్ ప్లాస్టెడ్ మాట్లాడుతూ, "2023లో ఈ ముఖ్యమైన అవార్డులను గెలుచుకోవడంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విజయం సాధించినందుకు మేము అభినందిస్తున్నాము." అన్నారు.

స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్‌లు విమానాశ్రయ పరిశ్రమకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు. 550కి పైగా విమానాశ్రయాలలో కస్టమర్ సేవ, సౌకర్యాలను అంచనా వేస్తూ ఈ సర్వే జరిగింది. కస్టమర్ల ఓట్ల ద్వారా ఈ ఎంపిక జరిగింది

First Published:  17 March 2023 2:25 AM GMT
Next Story