Telugu Global
Telangana

సీసీ కెమెరాల నిఘాలో ప్రపంచంలో హైదరాబాద్ కి టాప్-3 ప్లేస్

సీసీ కెమెరాల సంఖ్య పరంగా చూస్తే మాత్రం హైదరాబాద్ దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉంది. ఇండోర్ నగరంలో సుమారుగా 32 లక్షల జనాభాకు 2 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి. కోటి జనాభా దాటిని హైదరాబాద్ నగరంలో 4,40,299 కెమెరాలు ఉన్నాయి.

సీసీ కెమెరాల నిఘాలో ప్రపంచంలో హైదరాబాద్ కి టాప్-3 ప్లేస్
X

సీసీ కెమెరాల నిఘాలో ప్రపంచంలోనే హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. భారత్ లో రెండో స్థానం దక్కించుకుంది. దక్షిణాదిలో మాత్రం హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉంది. నేరాల అదుపు, పౌరుల భద్రత, రక్షణకోసం సీసీ కెమెరాల పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో సీసీ కెమెరాల నిఘా మరింత పెరిగింది. హైదరాబాద్ లో మొత్తం 4,40,299 సీసీ కెమెరాలు ఉన్నాయి.

నగరం పేరు - వెయ్యిమంది జనాభాకు ఉన్న సీసీ కెమెరాలు

బీజింగ్ (చైనా) - 372.80

ఇండోర్ (ఇండియా) - 62.52

హైదరాబాద్ (ఇండియా) - 41.80

ఢిల్లీ (ఇండియా) - 26.70

చెన్నై (ఇండియా) - 24.53

ప్రపంచ వ్యాప్తంగా అత్యథిక సీసీ కెమెరాల ఉన్న నగరాల జాబితాలో తొలి ఐదింటిలో నాలుగు భారత్ లోనే ఉండటం విశేషం. అందులో దక్షిణాది నగరాలు రెండు కాగా, హైదరాబాద్ ఆ రెండిటిలో టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. బీజీంగ్ నగరంలో ప్రతి 1000 మంది జనాభాకు 372.80 సీసీ కెమెరాలు ఉండగా, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 62.52 కెమెరాలున్నాయి. హైదరాబాద్ 41.80 తో మూడో స్థానంలో ఉంది. లండన్, బ్యాంకాక్, న్యూయార్క్, పారిస్, బెర్లిన్ వంటి నగరాలు కూడా భారతీయ నగరాల తర్వాతే ఉన్నాయి.

సీసీ కెమెరాల సంఖ్య పరంగా చూస్తే మాత్రం హైదరాబాద్ దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉంది. ఇండోర్ నగరంలో సుమారుగా 32 లక్షల జనాభాకు 2 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి. కోటి జనాభా దాటిని హైదరాబాద్ నగరంలో 4,40,299 కెమెరాలు ఉన్నాయి. 1.60 కోట్ల జనాభా కలిగిన ఢిల్లీలో 4,36,600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో 100కోట్ల సీసీ కెమెరాలు ఉండగా.. అందులో 54 శాతం ఒక్క చైనాలోనే ఉండటం విశేషం.

First Published:  23 Nov 2022 6:15 AM GMT
Next Story