Telugu Global
Telangana

దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ను నిర్మిస్తున్న హైదరాబాద్‌ కంపెనీ

నోవస్ గ్రీన్ తమ స్వంత టీం ద్వారానే ఎండ్-టు-ఎండ్ తయారీ, అమలును నిర్వహించిందని నోవస్ గ్రీన్ ఎండి అన్షుమాన్ యెనిగళ్ల తెలిపారు. మేక్ ఇన్ ఇండియా స్పూర్తితో ప్లాంట్‌లో ఉపయోగించే సోలార్ ప్యానెల్‌లను భారతదేశంలోనే తయారు చేశారు.

దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ను నిర్మిస్తున్న హైదరాబాద్‌ కంపెనీ
X

హైదరాబాద్‌కు చెందిన నోవస్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్ శనివారం మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో పారదర్శక గాజు-గ్లాస్ మాడ్యూల్స్‌తో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసింది.

ఇది 15 MW (AC) / 19.5 MW (DC) సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్ ప్లాంట్ అని నోవస్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్ తెలిపింది. ప్రస్తుతానికి 5MW కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్లాంట్‌లో పారదర్శకమైన గ్లాస్-టు-గ్లాస్ సోలార్ మాడ్యూల్‌లు ఉపయోగిస్తున్నారు, ఇవి సాంప్రదాయ సోలార్ మాడ్యూల్స్ కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయి. భారతదేశంలో ఈ స్థాయిలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిది అని కంపెనీ తెలిపింది.

సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న‌ ఈ ప్రాజెక్ట్, ఇ-బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా నోవస్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్, ఇలియోస్ పవర్ కన్సార్టియమ్‌కు లభించింది.

నోవస్ గ్రీన్ తమ స్వంత టీం ద్వారానే ఎండ్-టు-ఎండ్ తయారీ, అమలును నిర్వహించిందని నోవస్ గ్రీన్ ఎండి అన్షుమాన్ యెనిగళ్ల తెలిపారు. మేక్ ఇన్ ఇండియా స్పూర్తితో ప్లాంట్‌లో ఉపయోగించే సోలార్ ప్యానెల్‌లను భారతదేశంలోనే తయారు చేశారు.

ఇలియోస్ పవర్ CEO, నవీన్ ఉన్నమ్ మాట్లాడుతూ, రాబోయే కొద్ది నెలల్లో మిగిలిన 10MW(AC)/13.5(DC)ని పూర్తి చేస్తామని చెప్పారు.

ఈ ప్రాజెక్ట్ అనేక సవాళ్లను ఎదుర్కొంది, భారతీయ కంపెనీ 'ఫ్లోట్ ఓల్ట్' ఫ్లోటింగ్ బోర్డుల‌ను తయారు చేసింది . ఫ్రేమ్‌లెస్ గ్లాస్ ను ఫ్లోట్ బోర్డులపై అమర్చడం వంటి కార్యక్రమాలు మొత్తం అత్యుత్త‌మ‌ ప్రమాణాలకు అనుగుణంగా జరిగాయి.మొత్తం డిజైన్‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) పరిశీలించింది, ఇది IIT వంటి ప్రీమియం ఇన్‌స్టిట్యూట్ ద్వారా పరిశీలించబడిన మొదటి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌గా నిలిచింది.

First Published:  29 Jan 2023 3:23 AM GMT
Next Story