Telugu Global
Telangana

హైదరాబాద్ విమానాశ్రయంలో త్వరలో థియేటర్, గోల్ఫ్ సౌకర్యం

పెద్ద స్క్రీన్ ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ముందు భాగంలో సెటప్ చేస్తారని భావిస్తున్నారు. సినిమా చూడటానికి అనేక కార్లు ఒకేసారి స్క్రీనింగ్ ఏరియాలో నిలబడేంత ప్లేస్ ఉంటుంది.

హైదరాబాద్ విమానాశ్రయంలో త్వరలో థియేటర్, గోల్ఫ్ సౌకర్యం
X

త్వరలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఏరో ప్లాజాలో డ్రైవ్-ఇన్ థియేటర్, ఆక్వా గోల్ఫ్ సదుపాయం కల్పించనున్నారు.

పెద్ద స్క్రీన్ ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ముందు భాగంలో సెటప్ చేస్తారని భావిస్తున్నారు. సినిమా చూడటానికి అనేక కార్లు ఒకేసారి స్క్రీనింగ్ ఏరియాలో నిలబడేంత ప్లేస్ ఉంటుంది. ఇక్కడ కార్లలో కూర్చొని మూవీ చూడొచ్చు. ఆక్వా గోల్ఫ్ అంటే అక్కడ ఒక చిన్న చెరువు ఉంటుంది.ఆ చెరువుపై ఉన్న లక్ష్యాలలోకి బంతులను కొట్టడమే టార్గెట్.

రెండు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఏరోప్లాజా గత ఏడాది ప్రయాణికుల కోసం ప్రారంభించారు. ఉచిత రోమింగ్ VR గేమింగ్, స్థానిక, అంతర్జాతీయ బ్రాండ్‌లు, గో కార్టింగ్, సూపర్ మార్కెట్లు కూడా ఉన్నాయి.

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయాన్ని మరింతగా విస్తరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న‌ 10,569 sq m వైశాల్యాన్ని నుండి 29,685 sq m వైశాల్యానికి పెంచుతున్నారు. ఈ ఎయిర్ పోర్ట్ ప్రతి సంవత్సరం 34 మిలియన్ల మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తుంది.

First Published:  4 Feb 2023 4:20 PM GMT
Next Story