Telugu Global
Telangana

సికిందరాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం... ఆరుగురి పరిస్థితి విషమం

దాదాపు నాలుగు గంటల ఆపరేషన్ తర్వాత పూర్తిగా అగ్నిని అదుపులోకి తీసుకవచ్చారు. ఈ ప్రమదాంలోంచి 15 మందిని రక్షించారు. అందులో 6గురి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా స్పృహ కోల్పోయిన స్థితిలో ఉండగా రెస్క్యూ సిబ్బంది గుర్తించి వారిని రక్షించారు.

సికిందరాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం... ఆరుగురి పరిస్థితి విషమం
X

సికిందరాబాద్ లో రూబీ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదం మర్చిపోకముందే సికిందరాబాద్ లోనే మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్వప్నలోక్‌ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. బిల్డింగ్‌ 7, 8వ అంతస్తుల్లో భారీగా మంటలు చెలరేగాయి.అగ్ని ప్రమాదంతో భవనం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకున్నది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి నాలుగు ఫైరింజన్లను తరలించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.

దాదాపు నాలుగు గంటల ఆపరేషన్ తర్వాత రాత్రి 11 గంటలకు పూర్తిగా అగ్నిని అదుపులోకి తీసుకవచ్చారు. ఈ ప్రమాదం లోంచి 15 మందిని రక్షించారు. అందులో 6గురి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా స్పృహ కోల్పోయిన స్థితిలో ఉండగా రెస్క్యూ సిబ్బంది గుర్తించి వారిని రక్షించారు. ఆ ఆరుగురిని దగ్గరలోని ప్రవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

కాగా కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం వల్ల కరెంట్ పోవడంతో పూర్తిగా చీకటి గా ఉంది. కాబట్టి బిల్డింగ్ లో మరెవరైనా ప్రమాదంలో చిక్కుకున్నారా అనేది తెలియడం లేదని ఫైర్ అధికారులు చెప్తున్నారు. కాగా, హోం మంత్రి మహమూద్ అలీ, టూరిజం మంత్రి శ్రీనివాస యాదవ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.

First Published:  16 March 2023 5:47 PM GMT
Next Story