Telugu Global
Telangana

ప‌సికందులు, గ‌ర్భిణుల‌కు సాంత్వ‌న‌.. నిలోఫ‌ర్‌లో కూల‌ర్లు, ఏసీలు

రోగులే కాదు వైద్యులు కూడా ఎండ వేడికి అల్లాడిపోతున్న‌నేప‌థ్యంలో ఏసీలు, కూల‌ర్లు ఏర్పాటు చేసిన‌ట్లు ఆస్ప‌త్రి అధికారులు వెల్ల‌డించారు.

ప‌సికందులు, గ‌ర్భిణుల‌కు సాంత్వ‌న‌.. నిలోఫ‌ర్‌లో కూల‌ర్లు, ఏసీలు
X

తెలంగాణ‌లో ప్ర‌సిద్ధికెక్కిన చిన్న పిల్ల‌ల ఆస్ప‌త్రి నిలోఫ‌ర్‌లో ఎండ వేడిమికి ప‌సికందులు, గ‌ర్భిణులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. దీంతో ఆస్ప‌త్రి యాజ‌మాన్యం వార్డుల్లో కూల‌ర్లు, ట‌వ‌ర్ ఏసీలు ఏర్పాటు చేసింది. దీంతో త‌ల్లులు, పిల్ల‌ల‌కు ఎండ వేడి నుంచి ఉప‌శ‌మ‌నం ద‌క్కిన‌ట్ల‌యింది.

రోగులే కాదు వైద్యులు కూడా ఎండ వేడికి అల్లాడిపోతున్న‌నేప‌థ్యంలో ఏసీలు, కూల‌ర్లు ఏర్పాటు చేసిన‌ట్లు ఆస్ప‌త్రి అధికారులు వెల్ల‌డించారు. జ‌న‌ర‌ల్ పీడియాట్రిక్ వార్డు, పోస్ట్‌నేట‌ల్ వార్డు, పీడియాట్రిక్ స‌ర్జ‌రీ ఓపీ వార్డుల్లో ఎయిర్ కూల‌ర్లు ఏర్పాటు చేశారు. గ‌త ఏడాది దాత‌లు స‌మ‌కూర్చిన ట‌వ‌ర్ ఏసీలు పాడవ‌డంతో వాటిని కూడా బాగు చేయించి, వార్డుల్లో ఏర్పాటు చేశారు.

ఆర్వో ప్లాంట్లు, వాట‌ర్ కూల‌ర్లు

మండు వేస‌విలో రోగుల‌ దాహార్తి తీర్చేందుకు ఆర్వోప్లాంట్లు సిద్ధం చేశారు. వాట‌ర్ కూల‌ర్లు కూడా ఏర్పాటు చేశారు. రోగుల బంధువులు వేచి ఉండే షెల్ట‌ర్ హోం, ఓపీలో వాట‌ర్ కూల‌ర్లు పెట్టారు. ఇక ఐసీయూలు, వార్డుల్లో రోగుల కోసం ఆర్వో ప్లాంట్లు పెట్టారు. దీంతో రోగుల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ఏర్ప‌డింది.

First Published:  6 May 2024 10:32 AM GMT
Next Story