Telugu Global
Telangana

తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతమైనది : సీఎం కేసీఆర్

తెలంగాణ చరిత్రకారులు చేస్తున్న కృషి చాలా అభినందనీయమని సీఎం కేసీఆర్ అన్నారు.

తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతమైనది : సీఎం కేసీఆర్
X

తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతమైనదని, కోట్లాది సంవత్సరాల చరిత్రకు తెలంగాణ సాక్ష్యంగా నిలవడం ఆనందంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం చారిత్రక ఆనవాళ్లు కూడా తెలంగాణలో లభ్యం కావడం చాలా గర్వకారణమని అన్నారు. తెలంగాణ చరిత్రను భావితరాలకు తెలిపే విధంగా.. భారత జాగృతి సంస్థ తెలంగాణ చరిత్ర పుస్తకాన్ని 5 సంపుటాలుగా ప్రచురించింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సీఎం కేసీఆర్ ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

తెలంగాణ చరిత్రకారులు చేస్తున్న కృషి చాలా అభినందనీయమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయా కాలాలలో కొనసాగిన సామాజిక పరిస్థితులు, పరిపాలన రీతులు, నాటి దార్శనికత అర్థం చేసుకుంటే.. రేపటికి మనకు దారి చూపుతాయని అన్నారు. మన చరిత్రను అర్థం చేసుకోవడం ద్వారా వర్తమానాన్ని అవగాహన చేసుకుంటే మనకు దారి చూపుతాయని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితను అభినందించారు. అలాగే జాగృతి చరిత్ర విభాగం బాధ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

భారత జాగృతి చరిత్ర విభాగం గత 6 ఏళ్లుగా రాష్ట్రంలోని అనేక చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. చరిత్రకారుడు, రచయిత అయిన శ్రీమోజు హరగోపాల్ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో పరిశోధన చేసి ఈ పుస్తకాలకు రూపకల్పన చేశారు. ఇందుకు మామిడి హరికృష్ణ, వేముగంటి మురళీకృష్ణ సంపాదకత్వం వహించారు. చరిత్ర కోసం ఆయా ప్రదేశాలలోని శిలాజాలు, కట్టడాలు, శాసనాలు, నాణాలు, గ్రంథాలతో సహా అన్ని రకాల చారిత్రక ఆధారాలను అధ్యయనం చేసినట్లు వాళ్లు సీఎం కేసీఆర్‌కు తెలిపారు.


First Published:  11 Jun 2023 11:39 AM GMT
Next Story